Haryana Covid-19 : 300 కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు చేశాడు.. చివరికి వైరస్ సోకి మరణించాడు!
కరోనా బాధిత మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించి.. వైరస్ బారినపడి మృతిచెందాడో హర్యానాకు చెందిన వ్యక్తి. కరోనాతో కన్నుమూసిన వందలాది మందికి ఇతడే దగ్గరుండి అంత్యక్రియలు పూర్తిచేశాడు..

Haryana Man Who Performed Last Rites Of Over 300 Covid Victims Succumbs To Virus
Haryana man succumbs to virus : కరోనా బాధిత మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించి.. వైరస్ బారినపడి మృతిచెందాడో హర్యానాకు చెందిన వ్యక్తి. కరోనాతో కన్నుమూసిన వందలాది మందికి ఇతడే దగ్గరుండి అంత్యక్రియలు పూర్తిచేశాడు.. చివరికి వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయాడు. 44 ఏళ్ల ప్రవీణ్ కుమార్ హిసార్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
కరోనా వైరస్ రోగుల మృతదేహాలను దహనం చేయడానికి మున్సిపాల్ కార్పొరేషన్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందానికి ప్రవీణ్ నేతృత్వం వహించాడు. కరోనాతో మృతిచెందినవారి మృతదేహాలను అంత్యక్రియలు నిర్వహించడం వీరి విధి. కరోనా మృతుల బంధువులు కూడా తాకడానికి భయపడతారు.
అలాంటి పరిస్థితుల్లోనూ ఎలాంటి భయం లేకుండా దాదాపు 300 మంది కరోనా మృతదేహాలకు దహన సంస్కరాలు నిర్వహించాడు. చివరికి ప్రవీణ్ కుమార్ కూడా కొవిడ్ బారిన పడ్డాడు. ప్రవీణ్ ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో ఆస్పత్రిలో చేర్చారు. దురదృష్టవశాత్తు కొవిడ్ సోకిన రెండు రోజులకే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
వందలాది మంది కరోనా మృతులకు అంతిమ సంస్కారాలు నిర్వహించిన ప్రవీణ్ కోవిడ్ బారినపడి మృతిచెందడం విచారకరం.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హిసర్ మేయర్ ఆధ్వర్యంలో రిషినగర్‌లో ప్రవీణ్ అంత్యక్రియలు నిర్వహించారు. ప్రవీణ్‌కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.