ఆరోగ్య మంత్రిపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగం

Haryana Minister Anil Vij to take trial dose of Covaxin కరోనా వైరస్ ని అంతమొందించేందుకు భారత్ బయోటెక్ సంస్థ “కొవాగ్జిన్ టీకా”ను అభివృద్ధి చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే, కరోనా వ్యాక్సిన్ “కొవాగ్జిన్” ట్రయిల్ డోస్ ని తనపై ప్రయోగించుకునేందుకు హర్యాణా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ సిద్ధమయ్యారు.
ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్లో వెల్లడించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు అంబాలా కాంట్ సివిల్ హాస్పిటల్ లో వ్యాక్సిన్ డోస్‌ను తీసుకోనున్నట్లు స్వయంగా ఆయనే ట్విట్టర్ లో ప్రకటించారు.
పీజీఐ రోహ్తక్ వైద్యుల బృందం సమక్షంలో ఈ ప్రయోగానికి సిద్ధమైనట్లు తెలిపారు. కొవాగ్జిన్ టీకా మూడో దశ ప్రయోగాల కోసం బుధవారమే…వలంటీరుగా నమోదు చేయించుకున్నారు అనిల్ విజ్. మరోవైపు,దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో చేసే ఈ ప్రయోగ పరీక్షల్లో 26 వేల మంది వలంటీర్లు పాలుపంచుకోనున్నారని భారత్ బయోటెక్ తెలిపింది. ఇప్పటికే ఒకటి, రెండు దశల్లో చేపట్టిన ప్రయోగాలు విజయవంతమైనట్లు సంస్థ పేర్కొంది. భారత వైద్య పరిశోధన మండలిశ(ఐసీఎంఆర్) సహకారంతో అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ కోసం దేశంలో భారత్ బయోటెక్ చేపడుతోన్న అతిపెద్ద క్లినికల్ పరీక్ష ఇదే కానుండటం విశేషం.