Hathras Gang Rapeపై CBI ఎంక్వైరీ జరపాలని తండ్రి ఆక్రందన

రాజకీయ నాయకుల మాట ఏమైపోయినా.. దేశమంతటా వినిపిస్తుంది Hathras Gang Rape గురించి ఆవేదనే. సోషల్ మీడియా వేదికగా ఈ ఘటనపై విచారణ జరిపి సరైన న్యాయం జరగాలంటూ గొంతెత్తున్నారు. ఇంతటి ఘోరమైన ఘటనకు ప్రస్తుతం నడుస్తున్న న్యాయ విచారణ సరిపోదని దీనిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాడు బాధితురాలి తండ్రి.
ఈ ఇన్వెస్టిగేషన్స్ మాకు సరైన న్యాయంగా అనిపించలేదు. ఈ కేసును CBIకి అప్పగించాలని కోరుతున్నాం. ప్రస్తుతం కుటుంబమంతా హౌజ్ అరెస్ట్ లో ఉంది. మమ్మల్ని కలవడానికి మీడియా పర్సన్స్ కి కూడా అనుమతి లేదు’ అని ఆవేదన వెల్లగక్కుతున్న ఆ తండ్రి మాటల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీనిపై కాంగ్రెస్ లీడర్స్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. ఆ బాధిత కుటుంబాన్ని కలుసుకునేందుకు హత్రాస్ వెళ్లాలని ప్లాన్ చేసకున్నారు. ‘అన్యాయానికి మరో అన్యాయం జరిగింది’ అని ప్రియాంక ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ‘ఆ తండ్రి స్టేట్‌మెంట్ విన్న తర్వాత వాళ్లను బలవంతంగా లోపల ఉంచారు. ఇన్వెస్టిగేషన్ తో వారు సంతృప్తిగా లేరు. ప్రస్తుతం కుటుంబమంతా హౌజ్ అరెస్ట్ లో ఉంది. మాట్లాడటానికి కూడా అనుమతి లేదు. వాళ్లపై దాడి చేసి సైలెన్స్ చేయాలనుకుంటుందా ప్రభుత్వం? అన్యాయానికి మరో అన్యాయం జరిగింది. అంటూ ఆమె హిందీలో ట్వీట్ చేశారు.
దళిత వర్గానికి చెందిన 20ఏళ్ల మహిళపై సెప్టెంబర్ 19న దాడి జరిగింది. పొలం పనులకు వెళ్లిన ఆమెను లాక్కెళ్లి అత్యాచారం చేయడమే కాకుండా.. నాలుక కోసి, నగ్నంగా, రక్తం వచ్చేలా కాళ్లుచేతులు చచ్చుబడేలా చేశారు. ఆమె కోసం వెదుకుతున్న తల్లిదండ్రులకు కదలలేని స్థితిలో కనిపించింది. హాస్పిటల్ కు తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ ఇప్పిస్తుండగా రెండు వారాల పాటు పోరాడి మంగళవారం కనుమూసింది.
కుటుంబానికి శవం అప్పగించడంతో.. జరిగిన దారుణం తలచుకుని.. కూతురిని కోల్పోయినందుకు శోక సంద్రంలో మునిగిపోయిన కుటుంబానికి మరో షాక్. అంత్యక్రియలు నిర్వహించాలంటూ పట్టుబట్టి అర్ధరాత్రే పోలీసుల సమక్షంలోనే పూర్తి చేసేశారు. కుటుంబాన్ని నిర్భందించి సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వర్తించుకోవడానికి కాదు కదా చివరి చూపు కూడా దక్కకుండా చేశారు
ఈ ఘటనపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ తీవ్రంగా విమర్శించారు. ఆ మహిళను ఈ క్రూరమైన ప్రభుత్వమే చంపేసింది. ప్రజల్లో ఆగ్రహం మొదలుకాకముందే మ్యాటర్ ను తుడిచేయాలని అనుకున్నారని తెలిపారు.