Heart Attack : భయపెడుతున్న గుండెపోటు మరణాలు.. బ్యాడ్మింటన్ ఆడుతూ హార్ట్ ఎటాక్‌తో మృతి

Heart Attack : మహేంద్ర శర్మ అనే వ్యక్తి బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. సడెన్ గా ఆయనకు గుండెపోటు వచ్చింది. అంతే, అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.

Heart Attack : భయపెడుతున్న గుండెపోటు మరణాలు.. బ్యాడ్మింటన్ ఆడుతూ హార్ట్ ఎటాక్‌తో మృతి

Heart Attack (Photo : Google)

Updated On : June 11, 2023 / 8:13 PM IST

Heart Attack – Noida : ఈమధ్య కాలంలో గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. చిన్న, పెద్ద అనే తేడా లేదు. అంతా గుండెపోటు బారిన పడుతున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు, హెల్తీగా ఫిట్ గా ఉన్న వారు సైతం హార్ట్ ఎటాక్ తో మరణిస్తున్నారు. ఈ పరిణామం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా నోయిడాలో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో మరణించాడు.

సెక్టార్ 21ఏలో ఈ ఘటన జరిగింది. మహేంద్ర శర్మ అనే వ్యక్తి బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. ఆయన వయసు 52 సంవత్సరాలు. ఆయన తన ఫ్రెండ్స్ తో కలిసి బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. ఇంతలో సడెన్ గా ఆయనకు గుండెపోటు వచ్చింది. అంతే, అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. సమాచారం అందుకున్న ఆసుపత్రి సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆయనను బతికించేందుకు సీపీఆర్ చేశారు. తీవ్రంగా శ్రమించినా ప్రయోజనం లేకపోయింది. శర్మ చనిపోయారు.

Also Read.. Health Benefits Of Jamun : డయాబెటిస్‌ఉన్నవారు నేరేడు పండ్లు తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు !

మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువసేపు కూర్చుని చేసే ఉద్యోగాలు.. వీటి కారణంగా గుండెపోట్లు పెరిగిపోయాయని డాక్టర్లు చెబుతున్నారు. ఏజ్ తో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్స్ రావడానికి కారణాలు ఇవే అన్నారు. జబ్బులతో బాధపడుతున్న వారే కాదు.. ఆరోగ్యంగా ఉన్న వారు, యువకులు, చివరికి చిన్నపిల్లలు కూడా గుండెపోటుతో మరణిస్తున్నారు.

Also Read..Heat Wave Tips : వేసవి వడగాల్పులను ఎదుర్కోవాలంటే వేడి కాఫీ, టీలతోపాటు ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం మంచిది !