Fire Accident : ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ లో భారీ అగ్ని ప్రమాదాలు

ప్లాస్టిక్ కంపెనీలో మంటలు చెలరేగాయి. చుట్టు పక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి.

Fire Accident : ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ లో భారీ అగ్ని ప్రమాదాలు

Fire Accident (2) (1)

Updated On : July 30, 2023 / 1:45 PM IST

Delhi – West Bengal : ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షూ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి.

సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు. మరోవైపు పశ్చిమ బెంగాల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 24 పరగణాల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి.

Kerala: కేరళలో దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. గొంతునులిమి హత్య ..

ప్లాస్టిక్ కంపెనీలో మంటలు చెలరేగాయి. చుట్టు పక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 15 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పి వేస్తున్నారు.