కర్ణాటకలో భారీ వర్షం..ఓటర్ల ఇబ్బందులు

  • Published By: veegamteam ,Published On : April 23, 2019 / 10:51 AM IST
కర్ణాటకలో భారీ వర్షం..ఓటర్ల ఇబ్బందులు

Updated On : April 23, 2019 / 10:51 AM IST

కర్ణాటక: కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు  అంతరాయం కలుగుతోంది.  ఉత్తరకన్నడ జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. సిర్సి ప్రాంతంలో 92వ నంబర్ పోలింగ్ కేంద్రం వద్ద కుండపోత వర్షం పడుతుండటంతో..ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.