Hidma Key Role : కీలక సూత్రధారి హిడ్మా.. దాడి వెనుక ప్లాన్ ఇతడిదే!

బీజాపూర్‌ తరెంలో సీఆర్పీఎఫ్‌పై దాడికి కీలక సూత్రధారి హిడ్మాగా అనుమానిస్తున్నారు పోలీసులు. మావోయిస్టు పార్టీలో భారీ దాడులకు వ్యూహకర్తగా పేరున్న అతడు ప్రస్తుతం పీఎల్‌జీఏ నంబర్‌ వన్ బెటాలియన్‌కు కమాండర్‌గా ఉన్నాడు.

Hidma Key Role : కీలక సూత్రధారి హిడ్మా.. దాడి వెనుక ప్లాన్ ఇతడిదే!

Hidma Key Role To Attack On Massive Security Operation Forces

Updated On : April 5, 2021 / 8:35 AM IST

Hidma Key Role to attack : బీజాపూర్‌ తరెంలో సీఆర్పీఎఫ్‌పై దాడికి కీలక సూత్రధారి హిడ్మాగా అనుమానిస్తున్నారు పోలీసులు. మావోయిస్టు పార్టీలో భారీ దాడులకు వ్యూహకర్తగా పేరున్న అతడు ప్రస్తుతం పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) నంబర్‌ వన్ బెటాలియన్‌కు కమాండర్‌గా ఉన్నాడు. ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ (DKSZC) సభ్యుడిగా ఉన్నాడు. రెండు దశాబ్దాలుగా దండకారణ్యంలో జరిగిన భారీ దాడుల్లో హిడ్మా ప్రమేయం ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

సుకుమా జిల్లాలో పువర్తి ఏరియాకు చెందిన గిరిజనుడు హిడ్మా. మూడు దశాబ్దాల క్రితమే మావోయిస్టు కమ్యూనిస్ట్‌ సెంటర్‌ లో చేరాడు. మొదట్లోనే చదవును మానేశాడు. మావోయిస్టు ఆపరేషన్లలో ఇతడికి ఎదురులేదు. వ్యూహాలను రచించడంలో ఇతడికి పేరుంది. కూంబింగ్‌ ఆపరేషన్లలో పోలీస్‌ బలగాలపై, సీఆర్పీఎఫ్‌ క్యాంపులపై దాడులు చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంటాడు.

ఆయుధాలు, ఐఈడీ బాంబులు తయారు హిడ్మాకు మంచి పట్టుంది. సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌కు అధిపతిగా ఉన్న హిడ్మా తలపై రూ.40 లక్షల రివార్డు ఉంది. గతంలో బీజేపీ ఎమ్మెల్యే భీమా మడవి హత్య కేసులో ఎన్‌ఐఏ అతనిపై అభియోగపత్రం నమోదు చేసింది. దాడిలో దాదాపు 250 మంది ఉన్న పీఎల్‌జీఏ బెటాలియన్‌కు హిడ్మా నేతృత్వం వహించాడని నిఘా వర్గాల సమచారం.