Hijab row: అంతర్గత సమస్యలపై మీ ప్రేరణ అవసర్లేదు

కర్ణాటకలో రచ్ఛ పుట్టిస్తున్న హిజాబ్ వివాదంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టేట్మెంట్ విడుదల చేసింది. ఇతర దేశాలు జోక్యం చేసుకుని ప్రేరణాత్మకమైన వ్యాఖ్యలు చేయాల్సిన అవసర్లేదని....

Hijab row: అంతర్గత సమస్యలపై మీ ప్రేరణ అవసర్లేదు

Hizab Row (1)

Updated On : February 12, 2022 / 12:16 PM IST

Hijab row: కర్ణాటకలో రచ్ఛ పుట్టిస్తున్న హిజాబ్ వివాదంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టేట్మెంట్ విడుదల చేసింది. ఇతర దేశాలు జోక్యం చేసుకుని ప్రేరణాత్మకమైన వ్యాఖ్యలు చేయాల్సిన అవసర్లేదని స్పష్టం చేసింది. ‘అంతర్గత సమస్యలపై మీరు చేసే వ్యాఖ్యలను స్వాగతించం’ అని అందులో పేర్కొంది. కర్ణాటక హైకోర్టులో న్యాయపరమైన విచారణ ఎదుర్కొంటుందని వెల్లడించింది.

విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందం బాచీ స్టేట్మెంట్ ను ట్వీట్ చేశారు.

డ్రెస్ కోడ్ విషయంలో కర్ణాటకలోని కొన్ని విద్యా సంస్థలపై కర్ణాటక హైకోర్టు న్యాయపరమైన విచారణ నిర్వహిస్తుంది. మన రాజ్యంగపరమైన పనులు, మెకానిజం, ప్రజాస్వామ్మ పద్ధతులు, రాజతంత్రంపై నమ్మకం ఉంది. మన సమస్యలను పరిష్కరించుకోగలం. ఇండియా గురించి తెలిసిన వాళ్లు వాస్తవికతను చూసి అభినందిస్తారు. అంతర్గత సమస్యలపై మీ వ్యాఖ్యలను అనుమతించం’ అంటూ రెస్పాండ్ అయ్యారు.

Read Also : వ్యాక్సిన్ వేసుకోని 3 వేల మున్సిపల్ సిబ్బందిపై చర్యలు!

డిసెంబరులో ఉడుపిలోని గవర్నమెంట్ ప్రీ యూనివర్సిటీ కాలేజీలో మొదలైంది ఈ హిజాబ్ వివాదం. దీనికి వ్యతిరేకంగా ఉద్యమించే క్రమంలో కొందరు విద్యార్థుల గుంపు కాషాయ కండువాలకు కప్పుకుని కాలేజీకి వచ్చారు. దీనిపై పరిష్కారం కావాలని కోరుతూ తమ హక్కు అయిన హిజాబ్ కావాలని కోరుతూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు కొందరు విద్యార్థులు.

ఈ పిటిషన్ సోమవారానికి వాయిదాపడింది. అంశం ఫిబ్రవరి 14వరకూ విచారణలో ఉండగా అప్పటి వరకూ ఎటువంటి మతపరమైన దుస్తులు వేసుకోకూడదని హైకోర్టు సూచనలు ఇచ్చింది.