Assam CM: అస్సాం కొత్త సీఎంను అనౌన్స్ చేసిన బీజేపీ

అస్సాం కొత్త సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్‌ వీడింది. ఆదివారం బీజేపీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించి రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి పేరు ప్రకటించింది.

Assam CM: అస్సాం కొత్త సీఎంను అనౌన్స్ చేసిన బీజేపీ

Assam Cm

Updated On : May 9, 2021 / 2:38 PM IST

Assam CM: అస్సాం కొత్త సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్‌ వీడింది. ఆదివారం బీజేపీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించి రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి పేరు ప్రకటించింది. హిమంత బిశ్వ శర్మను సీఎంగా ప్రతిపాదిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు మద్ధతు తెలిపారు. ఈ పదవి కోసం సీనియర్‌ నేతలు సర్బానంద సోనోవాల్, హిమంత బిశ్వ శర్మ పోటీపడిన విషయం తెలిసిందే.

గత ప్రభుత్వంలో సోనోవాల్‌ ముఖ్యమంత్రిగా, శర్మ ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. మరో వైపు అస్సాం సీఎం సర్బానంద సోనోవాల్ గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పించారు.

ఇక సీఎంగా ఎన్నికైన బిశ్వ శర్మ అస్సామీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు. ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. అస్సాంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నాయకత్వం సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించలేదు. అస్సాంలో 126 అసెంబ్లీ సీట్లుండగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 60 సీట్లు గెలుచుకుంది.

మిత్రపక్షాలైన ఏజీపీ 9, యూపీపీఎల్‌ 6 సీట్లు మాత్రమే దక్కించుకోగలిగాయి.