కాశీ మహాకాళ్ ఎక్స్ ప్రెస్ సీట్ నెం 64 మహాశివుడికి ఆలయమైపోయింది

సాధారణంగా కొన్ని ఆర్టీసీ బస్సుల్లో సీట్ ఫర్ ఎమ్మెల్యే, ఎంపీ అంటూ కొన్ని సీట్లు రిజర్వ్ చేసి.. వాటిపై రాసి ఉంటుంది. అలాగే రైళ్లలో కొంతమంది ఎంపీలకు బెర్త్ లు, సీట్లు రిజర్వు చేసి ఉంటడం మనకు తెలుసు. కానీ ఇప్పుడు రైల్వే అధికారులు శివుడి కోసం ఒక బెర్త్ రిజర్వు చేసి ఉంచారు.
కాశీ మహాకాళ్ ఎక్స్ ప్రెస్ లో శివుడికి బెర్త్ కేటాయించటం, రైలు బోగీలోనే పూజలుచేసి ఏకంగా మినీ టెంపుల్ గా మార్చటం ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. తాజాగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చెయ్యటంతో ఈ వివాదం కాస్త వెలుగులోకి వచ్చింది.
మూడు జ్యోతిర్లింగాలను కలుపుతూ సాగే మహాకాళ్ ఎక్సెప్రెస్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం,ఫిబ్రవరి 16న ప్రారంభించారు. ఈ ట్రైన్ ఇండోర్ నుంచి కాశీకి రాకపోకలను జరుపుతుంది. జోతిర్లింగాలైన మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఓంకారేశ్వర్ ను, ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ ను, యూపీ.. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ టెంపుల్ ను అంటే మూడు జ్యోతిర్లింగాలను కలుపుతూ సాగుతుంది. కాగా ‘కాశీ మహాకాల్ ఎక్స్ ప్రెస్’ లో శివుడికి బెర్త్ ఏర్పాటుచేయటం ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది.
బి5 కోచ్ లోని సీట్ నెంబర్ 64 పూర్తిగా ఆయనకే కేటాయించారు. అంతటితో ఆగిపోకుండా అందులో శివుడి ఫోటో పెట్టి సీటును పూలతో అలంకరించారు. ప్రయాణికులు ఎవ్వరు ఈ సీట్ పైకి ఎక్కకూడదని తెలిపారు. ఈ బెర్త్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినప్పటికీ దీన్ని ఎంత కాలం వరకు దేవుడి పేరుతో కేటాయిస్తారనేది తేలాల్సి ఉంది.
వారానికి మూడు రోజులు నడిచే కాశీ మహాకాళ్ 3టైర్ ఏసీ ఎక్స్‌ప్రెస్ రైలు… ఫిబ్రవరి 20 నుంచి సర్వీసు ప్రారంభిస్తుంది. సుమారు 1131 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ మూడు జోతిర్లాంగాల క్షేత్రాలను చుట్టేస్తుంది. ఇండోర్ నుంచి కాశీకి సుమారు 19 గంటల ప్రయాణం చేస్తుంది. ఈ ట్రైన్ ప్రతి కోచ్ లో భక్తి సంగీతం చిన్నగా వినిపిస్తూ ఉంటుంది. ప్రయాణికులకు పూర్తి భక్తి భావం కలిగేలా ఇలాంటి సదుపాయం ఏర్పాటు చేశారు. దీంతో పాటు శాకాహార భోజనం కూడా అందించే ఏర్పాట్లు చేశారు. ప్రతి కోచ్ కు ఇద్దరు అటెండెంట్లను కేటాయించారు.
కాగా…. ఏసీ బోగీలున్న ఈ రైలులో ఒక బెర్తును గుడిగా మార్చటాన్ని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఈ వార్త తాలూకు ఫోటోను, రాజ్యాంగాన్ని ట్యాగ్ చేసి ప్రధానమంత్రి కార్యాలయానికి ఆయన ట్వీట్ చేశారు. అటు-దేవుడికి రైల్లో బెర్తును రిజర్వ్ చేయడమన్నది ఇదే మొదటిసారని శివుడి కోసం ఒక సీటు రిజర్వు చేయబడి, ఖాళీగా ఉంచడం ఇదే మొదటిసారి.
మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో మహాకాళ్ భగవంతుడి కోసం ఈ సీటు రిజర్వు చేయబడిందని ప్రజలకు తెలిసేలా సీటుపై ఒక ఆలయం కూడా ఏర్పాటు చేశారు అని నార్తర్న్ రైల్వే అధికారులు తెలిపారు అంటూ ఒవైసీ ట్వీట్ చేశారు. అది జ్యోతిర్లింగాలను కలుపుతూ సాగుతున్న రైలుగా అధికారులు చెప్తుంటే…. ఏదైనా రైలేనని ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని ఓవైసీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు ఈ వివాదం ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి.
Varanasi: Seat number 64 of coach B5 in Kashi Mahakal Express (Varanasi-Indore) has been turned into a mini-temple of Lord Shiva. The train was flagged off by Prime Minister Narendra Modi via video conferencing yesterday. pic.twitter.com/X5rO4Ftbl6
— ANI UP (@ANINewsUP) February 16, 2020