Independence Day 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 15 ఆగస్టు 1947 మంచి రోజు కాదట .. కానీ భారత్‌కు స్వాతంత్ర్యం ఎలా ఇచ్చారు?

బ్రిటీష్ ఇండియా ఆఖరి గవర్నర్ జనరల్‌గా పనిచేసిన లార్డ్ మౌంట్ బాటన్ భారత్‌కు 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యం ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఆ రోజు మంచి రోజు కాదని జ్యోతిష్యులు చెప్పారట. అదే తేదీన భారత్‌కు స్వాతంత్ర్యం ఇవ్వాలని బాటన్ పట్టుబడ్డారట. చివరికి అదే తేదీని ఎలా స్వాతంత్ర్యం వచ్చింది.

Independence Day 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 15 ఆగస్టు 1947 మంచి రోజు కాదట .. కానీ భారత్‌కు స్వాతంత్ర్యం ఎలా ఇచ్చారు?

Independence Day 2023

Independence Day 2023 : బ్రిటీషు వారు 1947 వ సంవత్సరంలో ఇండియాను విడిచిపెట్టినప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అయితే ఈ తేదీని ప్రత్యేకంగా ఎంచుకోవడం వెనుక కారణాలున్నాయి.

Independence Day 2023 : భారత్‌తో పాటు ఆగస్టు 15న స్వాతంత్ర్యం దినోత్సవం జరుపుకునే దేశాలు

1929 లో పూర్ణ స్వరాజ్ లేదా సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం అప్పుడు కాంగ్రెస్ పిలుపునిచ్చింది.  బ్రిటిష్ సంకెళ్ల నుంచి విముక్తి కోసం జనవరి 26 వ తేదీని ఎంచుకున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ 1930 నుంచి ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవడం కొనసాగించింది. అయితే భారతదేశానికి ఆగస్టు 15, 1947 న స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జనవరి 26, 1950 దేశం రిపబ్లిక్‌గా ప్రకటించబడింది. ఇండియా బ్రిటన్ డొమినియన్ హోదా లేని సార్వభౌమ దేశంగా మారింది.

 

బ్రిటీష్ ఇండియా ఆఖరి గవర్నర్ జనరల్‌గా పనిచేసిన లార్డ్ మౌంట్ బాటన్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని 1947 ఆగస్టు 15 న జరపాలని నిర్ణయించారు. జపాన్ లొంగిపోవడంతో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. ఆ రోజు ఆగస్టు 15 కావడంతో భారతదేశానికి ఆ తేదీని స్వాతంత్ర్యం ఇవ్వడానికి ఎంచుకున్నారు బాటన్. ఈ తేదీ ఆయనకు సెంటిమెంట్ అట.  అర్ధరాత్రి ఆగస్టు 15 దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వాలనే నిర్ణయం జరిగిన తరువాత అధికారాలన్నీ దేశానికి బదిలీ చేసే తరుణంలో ఎంతోమంది జ్యోతిష్యులను కూడా పిలిపించి మంచి ముహుర్తం చెప్పమన్నారట.

Independence day 2023 : తెలుగు దేశభక్తి సినిమాల్లో ఈ డైలాగ్స్ విన్నారా..? గూస్‌బంప్స్ రావాల్సిందే..

జ్యోతిష్యులు మాత్రం ఆగస్టు 15 1947 మంచి రోజు కాదని.. పవిత్రమైన రోజు కాదని తేల్చి చెప్పారట. వారు ఎంతో పరీక్షించి కొన్ని వేరే తేదీలను సూచించారట. మౌంట్ బాటెన్ వాటిని అంగీకరించలేదట. ఖచ్చితంగా ఆగస్టు 15 న భారత్‌కు స్వాతంత్ర్యం ప్రకటిస్తామని స్పష్టం చేశారట. ఆయన పట్టు విడవకపోవడంతో ఆగస్టు 14 ఆగస్టు 15 మధ్య రాత్రి సూచించారట జ్యోతిష్యులు. ఆగస్టు 14 వ తేదీ రాత్రి 11.51 నుంచి ఆగస్టు 15 తెల్లవారు ఝామున 12.30 నిముషాల మధ్య అధికార బదిలీ ప్రసంగం కూడా ముగించాలని జ్యోతిష్యులు సూచనలు చేశారట.. నెహ్రూ ఆ సమయంలోనే ప్రసంగం పూర్తి చేశారు. ఇలా ఆగస్టు 15 వ తేదీ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తేదీగా స్థిరపడింది.