Tihar Jail : వీఐపీలకు కేరాఫ్ తీహార్ జైల్.. దీని ప్రత్యేకతలు ఏమిటంటే?

తీహార్ జైలులో కరుడుగట్టిన నేరస్తులు ఉండటంతో ఒకరిపైఒకరు దాడులు.. గొడవలు, వివాదాలు కామన్. హై ప్రొఫైల్, కరుడుగట్టిన నేరగాళ్లు ఉండే ఈ జైలులో ..

Tihar Jail : వీఐపీలకు కేరాఫ్ తీహార్ జైల్.. దీని ప్రత్యేకతలు ఏమిటంటే?

kavitha

Tihar Jail : తీహార్ జైలు. ఈ పేరు వింటేనే ఓ క్రైమ్ వైబ్రేషన్. ఏదో తెలియని నెగెటివ్ ఫీలింగ్. ఎందుకంటే దేశంలోని కరుడుగట్టిన నేరస్తులంతా ఉండేది ఇక్కడే. సంచలనం సృష్టించిన కేసుల్లో ఏ ప్రముఖ వ్యక్తో లేక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టో అరెస్ట్ అయ్యారంటే వాళ్ల శ్రీకృష్ణ జన్మస్థానం కేరాఫ్ తీహార్ జైలే. అందుకే ఈ జైలు లోపల బయట హైసెక్యూరిటీతో.. నిరంతరం డేగ కళ్లతో నిఘా ఉంటుంది. దారుణమైన నేరాలకు పాల్పడ్డ రాజకీయ నాయకులు మొదలుకొని పారిశ్రామిక వేత్తలు, హంతకులు, ఉగ్రవాదులకు ఇదే కేరాఫ్ అడ్రస్. సంచలనం సృష్టించిన వేలాది కేసుల్లో నిందితులు తీహార్ జైలులోనే ఉన్నారు. ఎంతో మంది రాజకీయ నాయకులు సైతం ఇక్కడ ఊచలు లెక్కబెట్టారు. నేరాలు రుజువు కావడంతో ఎంతోమందిని ఈ జైలులోనే ఉరితీశారు.

Also Read : Mlc Kavitha : ఎమ్మెల్సీ కవిత అభ్యర్థనకు కోర్టు అంగీకారం.. జైల్లో ఆ వెసులుబాటు

ఆసియాలోనే అతిపెద్ద కారాగార ప్రాంగణం..
దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న చాణక్యపురి నుంచి ఏడు కిలో మీటర్ల దూరాన ఉన్న తీహార్గ్రామంలో ఈ జైలు ఉంది. అందుకే ఎక్కువగా తీహార్ జైలు అని అంటారు. ఈ జైలు, భారతదేశంలోనే కాక దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద కారాగార ప్రాంగణము. ఈ జైలులో 6వేల 251 మందికి సరిపడ వసతులున్నా.. ఎప్పుడూ అంతకన్న ఎక్కువ మంది నిందితులే ఉంటున్నారు. న్యాయ విచారణ ఎదుర్కొంటున్న అండర్ ట్రయల్ ఖైదీలంతా ఇందులోనే ఉంటారు. ఈ జైలులో ఎప్పుడూ పదివేలకు మించి ఖైదీలను ఉంచుతూ వస్తున్నారు. ఈ జైలులో ఖైదీలకు ఉదయం 5 గంటలకు టిఫిన్ పెడతారు. అందులో రోటీ, చపాతీ, పూరీలు, పప్పును అందిస్తారు. మధ్యాహ్నాం 12 గంటలకు పప్పు, అన్నం, సబ్జీ పెడతారు. రాత్రికి కూడా ఇదే మెనూ ఉంటుంది. వారానికి రెండుసార్లు ఖీర్ పెడతారు. ఇక ఖైదీలకు ఇక్కడ నాన్ వెజ్ ఫ్రీగా పెట్టరు. వారు కష్టపడిన డబ్బులతో.. క్యాంటీన్లో కొనుక్కోని తినాల్సి ఉంటుంది. ఇక కోర్టు అనుమతి ఉన్న ఖైదీలకు ప్రత్యేక వసతి, ఇంటి భోజనం అనుమతి ఉంటుంది.

Also Read : టీడీపీకి బిగ్ షాక్.. మాజీ ఎంపీ మాగంటి బాబు గుడ్ బై?

ప్రముఖలకు కేరాఫ్ తీహార్ జైలు..
2012లో ఢిల్లీ గ్యాంగ్ రేప్ లో ఐదుగురు నిందితులను తీహార్ జైలులోనే ఉరి తీశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య కేసులో అత్యంత కీలకమైన కేహార్ సింగ్, సత్వంత్ సింగ్లను ఈ జైలులోనే నిర్భంధించారు. పారిశ్రామిక వేత్తలను బెదిరించి వందల కోట్లు వసూళ్లకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేష్ చంద్రశేఖర్, ఒలింపిక్ రజత పతక విజేత సుశీల్ కుమార్, కాశ్మీరీ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్.. ఇలాంటి వాళ్లంతా ఇప్పుడు అక్కడే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియా, ఆప్ ఎంపీ సంజయ్.. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మినిస్టర్ సత్యేంద్రజైన్ తీహార్ జైలులోనే ఉన్నారు. లోక్ పాల్ బిల్లుకోసం పోరాడిన అన్నాహజారే, మనీలాండరింగ్ కేసులో కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఓటుకు నోటు కేసులో సమాజ్ వాదీ పార్టీ నేత అమర్సింగ్, కామన్వెల్త్ క్రీడల నిర్వాహణలో అవినీతి ఆరోపణలపై సురేశ్ కల్మాడి, ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ, దాణాకుంభ కోణం కేసులో లాలూప్రసాద్ యాదవ్, ముంబైకి చెందిన గ్యాంగ్ స్టర్ చోటా రాజన్, INX మీడియా అవినీతి కేసులో కేంద్ర హోంశాఖ మాజీమంత్రి చిదంబరం ఈ తీహార్ జైలుకు వెళ్లారు. 2G స్పెక్ట్రమ్ కేసులో అరెస్ట్ అయిన డి. రాజా, కనిమొళి.. ఇప్పుడు లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలుకే వెళ్లాల్సి వచ్చింది.

Also Read : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సీనియర్ నేత వీహెచ్ భేటీ

జైల్లో నిత్యం కొత్తరూల్స్ ..
తీహార్ జైలులో కరుడుగట్టిన నేరస్తులు ఉండటంతో ఒకరిపైఒకరు దాడులు.. గొడవలు, వివాదాలు కామన్. హై ప్రొఫైల్, కరుడుగట్టిన నేరగాళ్లు ఉండే ఈ జైలులో ఎప్పటికప్పుడు సంస్కరణలు జరుగుతూనే ఉంటాయి. గతంలో పలువురు ఖైదీలు ఈ జైలు నుంచి తప్పించుకున్నారు. అప్పటి నుంచి కొత్త రూల్స్ అమలు చేస్తున్నారు. అధికారులు, నిఘా కళ్లుగప్పి ఖైదీలు ఫోన్లు వాడుతుండటంతో.. తీహార్ జైలులో 15 కొత్త మొబైల్ జామర్లు అమర్చారు. ఇప్పటికే కాల్ జంబ్లింగ్ కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండగా.. అదనంగా 15 జామర్లు పెట్టారు. తీహార్ జైలు ఎంట్రీ పాయింట్ల దగ్గర అనేక స్థాయిల్లో తనిఖీలు చేసినప్పటికీ ఖైదీల చేతికి ఫోన్లు చేరుతున్నాయి. జైలు గోడల నుంచి మొబైల్ ఫోన్లు బయటికి విసిరేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. జైలు లోపల ఉన్న గ్యాంగ్ స్టర్లు వీడియో కాల్స్ చేయడం, బయటివారికి బెదిరింపు కాల్ చేయడం వంటి ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఖైదీల ఆగడాలు సాగకుండా కొత్త రూల్స్ అమలు చేస్తున్నారు.