కాశ్మీర్ లో హిజ్బుల్ ఉగ్రవాది అరెస్ట్

  • Published By: venkaiahnaidu ,Published On : March 28, 2019 / 03:51 PM IST
కాశ్మీర్ లో హిజ్బుల్ ఉగ్రవాది అరెస్ట్

Updated On : March 28, 2019 / 3:51 PM IST

దక్షిణ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో హిజ్బుల్ ముజాహిద్దీన్ కి చెందిన  ఉగ్రవాది రమీజ్ అహ్మద్ దార్ ని గురువారం(మార్చి-28,2019)భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు బిజ్బెహారా ప్రాంతంలో రమీజ్ అహ్మద్ దార్‌ అరెస్ట్ చేశారు.

 కుల్గాంకి చెందిన రమీజ్ అహ్మద్ దార్….ఏడాదిన్నరగా హిజ్బుల్ ఉగ్రవాద కార్యకలాపాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్లు స్థానిక పోలీస్ అధికారి తెలిపారు.అరెస్ట్ సమయంలో అతడి దగ్గర నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్టు ఆయన తెలిపారు.