Delhi HC : కరోనా వేళ..ఢిల్లీలో ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్ల కుంభకోణం
చైనాలో తయారైన నాసిరకం ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లను జర్మనీలో తయారైనవిగా నమ్మించి ప్రజలను మోసం చేసిన వ్యక్తిపై ఢిల్లీ హైకోర్టు ఫైర్ అయ్యింది.

Delhi
Oxygen Concentrators Case : కరోనా వేళ..ఆదుకోవాల్సింది పోయి..మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. శానిటైజర్స్ నుంచి మొదలుకుని ఆక్సిజన్ వరకు నకిలీలను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. ఇలాగే..ఢిల్లీకి చెందిన వ్యక్తి చేశాడు. ప్రజలను నమ్మే ప్రయత్నం చేశాడు. పాపం పండింది. చైనాలో తయారైన నాసిరకం ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లను జర్మనీలో తయారైనవిగా నమ్మించి ప్రజలను మోసం చేసిన వ్యక్తిపై ఢిల్లీ హైకోర్టు ఫైర్ అయ్యింది.
ఢిల్లీకి చెందిన నవనీత్ కర్లా అనే వ్యక్తి చైనాలో తయారైన నాసిరకం ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లను జర్మన్ మేడ్ ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లుగా నమ్మించి అనేక మందికి అంటగట్టాడు. వాట్సప్ ద్వారా గ్రూప్ క్రియేట్ చేసి తన మనుషుల ద్వారా భారీ ఎత్తున ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లు అమ్మించాడు. ఢిల్లీ ఆస్ప్రతుల్లో ఆక్సిజన్ దొరక్క రోగులు పెద్ద సంఖ్యలో చనిపోతున్న సమయంలో .. చాలా మంది తమ వారి కోసం కర్లా దగ్గర నుంచి ఈ నాసిరకం కాన్‌సన్‌ట్రేటర్లను కొనుగోలు చేశారు.
ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్ల నుంచి కనీసం 84 శాతం ఆక్సిజన్ రోగికి అందితేనే ప్రాణాలకు భరోసా… కానీ కర్లా అమ్మిన నాసిరకం ఆక్సిజన్ సిలిండర్ల నుంచి గరిష్టంగా 34 శాతం ఆక్సిజన్‌నే సరఫరా అవుతున్నట్టు తేలింది. దీంతో పోలీసులకు ఫిర్యాదులు అందాయి. వెంటనే కర్లా వ్యాపార సముదాయాలపై పోలీసులు దాడి చేయగా .. ఏకంగా 524 చైనా మేడ్ ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లు కనిపించాయి.
దీంతో కర్లా అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధమయ్యారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు కర్లా. కర్లా ఫోన్‌లో ఉన్న వాట్సప్ గ్రూపుల ద్వారా ఎవరెవరికి ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లు అమ్మాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కర్ల దగ్గర ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్ కొనుగోలు చేసి.. ఆపై ప్రాణాలు కోల్పోయినట్టు తేలితే.. కర్లాకు కఠిన శిక్ష పడేలా చూస్తామంటున్నారు ఢిల్లీ పోలీసులు.
Read More : ICMR Task Force : ప్లాస్మా థెరపీ వాడాలా వద్దా..? ఏ ట్రీట్‌మెంట్ తీసుకోవాలి..? ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి..?