ICMR Task Force : ప్లాస్మా థెరపీ వాడాలా వద్దా..? ఏ ట్రీట్‌మెంట్ తీసుకోవాలి..? ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి..?

కరోనా ప్రపంచాన్ని చుట్టుముట్టి ఏడాది దాటింది. రోగికి ఎలాంటి చికిత్స అందించాలన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. హైడ్రాక్సీక్లోరోక్విన్.. రెమ్‌డెసివిర్ ఇలా ఒక్కసారి ఒక్కో మెడిసిన్‌ ఇస్తూ రోగులను కాపాడుతున్నా.. పక్కాగా ఇదే ట్రీట్మెంట్ అని మాత్రం లేదు.

ICMR Task Force : ప్లాస్మా థెరపీ వాడాలా వద్దా..? ఏ ట్రీట్‌మెంట్ తీసుకోవాలి..? ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి..?

Icmr

Plasma Therapy : కరోనా ప్రపంచాన్ని చుట్టుముట్టి ఏడాది దాటింది. రోగికి ఎలాంటి చికిత్స అందించాలన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. హైడ్రాక్సీక్లోరోక్విన్.. రెమ్‌డెసివిర్ ఇలా ఒక్కసారి ఒక్కో మెడిసిన్‌ ఇస్తూ రోగులను కాపాడుతున్నా.. పక్కాగా ఇదే ట్రీట్మెంట్ అని మాత్రం లేదు.

ప్లాస్మా థెరపీ.. సంజీవని : –
ఇలాంటి సమయంలో ప్లాస్మా థెరపీ.. సంజీవనిలా కనిపించింది. అయితే మంచి ఫలితాలు వస్తున్నాయి కదా అని.. ప్లాస్మా ట్రీట్‌మెంట్ ఇష్టానుసారం చేస్తే.. అది మరింత ప్రమాదం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో ICMR కొన్ని కూలక సూచనలు చేసింది. 39 ట్రయల్ సెంటర్లలో 464 కొవిడ్ రోగులపై అధ్యయనం నిర్వహించింది. ICMR అధ్యయనం ప్రకారం ప్లాస్మా థెరపీ మరణాల రేటును తగ్గించడం లేదని తేలింది.

వారం రోజుల లోపు ప్లాస్మా : –
కోవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తి రక్తం నుంచి యాంటీబాడీలను సేకరించి… పరిస్థితి విషమంగా ఉన్న రోగులకు ఇస్తుంటారు. ఈ చికిత్సపై కేంద్ర ఆరోగ్య శాఖ ఏప్రిల్‌లో సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. అప్పటి నుంచే నుంచే దీనిపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. లక్షణాలు బయటపడ్డ వారం రోజుల లోపు ప్లాస్మాను ఇవ్వాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఆ తర్వాత ప్లాస్మాను ఇవ్వకూడదని క్లియర్‌గా సూచించింది. అధిక స్థాయిలో యాంటీబాడీలు కలిగిన దాతల ప్లాస్మా లభ్యమైనప్పుడే దాన్ని ఇవ్వాలని సూచించింది. ఇందులో ప్లాస్మాను ఆఫ్‌ లేబుల్ విధానంగా పేర్కొంది. ఆఫ్‌ లేబుల్‌ అంటే అనుమతిలేని వినియోగమని వివరించారు.

ప్రాణాల మీదకు వచ్చినప్పుడు : –
కరోనా లక్షణాలు ప్రారంభ దశలో ఉన్నప్పుడు మాత్రమే ప్లాస్మా చికిత్స ఉపయోగకరంగా ఉంటుంది. ప్రాణాల మీదకు వచ్చినప్పుడు.. ప్లాస్మా చేసినా ఫలితం ఉండకపోవచ్చని నిపుణులు అంటున్నారు. నిజానికి ఇప్పుడు కరోనా రోగి వెంటిలేటర్ మీదకు చేరుకోగానే.. రెమ్‌డెసివిర్, ప్లాస్మా థెరపీ అంటూ కుటుంబసభ్యులు పరుగులు పెడుతున్నారు. అలాంటి సమయంలో చికిత్స చేసినా ఫలితం ఉండదని.. పైగా ఉపయోగిస్తున్న మందులతో పాటు.. ప్లాస్మా చికిత్స మరిన్ని ప్రమాదకర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ప్లాస్మా థెరపీపై ఇలాంటి అనుమానాలు వినిపిస్తున్న సమయంలో.. కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ భేటీ కానుంది. ఐసీఎంఆర్ సూచనల ఆధారంగా మార్గదర్శకాలకు మరిన్ని సవరణలు చేసి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

ప్లాస్మా సంగతి సరే : –
ప్లాస్మా సంగతి సరే… మరి…కోవిడ్ చికిత్సలో రెమ్‌డిసివిర్ ఇంజక్షన్లను వాడుతున్నారు. క్రిటికల్ కండిషన్‌లో ఉన్న పేషెంట్‌కు ఐదు రోజుల్లో ఆరు వయల్స్ ఇస్తున్నారు. కానీ… రెమ్‌డిసివిర్ సంజీవని కాదని నిపుణులంటున్నారు. ఈ ఇంజెక్షన్ కూడా… ప్రాణాలను కాపాడుతుందనే విషయం శాస్త్రీయంగా రుజువు కాలేదనే వాదనా ఉంది. వీటితో పాటు.. టొసిలిజుమాబ్ కూడా కరోనా ట్రీట్‌మెంట్‌కు ఉపయోగించవచ్చని కొన్నాళ్ల కింద నిపుణులు సూచించారు.

రెమ్‌డిసివర్: –
కానీ.. దానిపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇంజక్షన్ కూడా.. అంతగా ఉపయోగం లేదంటున్నారు. మరోవైపు.. ఐవర్ మెక్టిన్ ట్యాబ్లెట్ కరోనాను సమర్థవంతంగా అడ్డుకుంటోందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ ట్యాబ్‌లెట్‌తో మరణాలు తక్కువే అయినా…వాడకం వద్దని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. ఇలా కరోనా చికిత్స కోసం నిత్యం ఏదో ట్రీట్‌మెంట్ తెరపైకి రావడం.. ఆ తర్వాత అది మంచిది కాదు అంటూ అభిప్రాయాలు వెలువడుతుండటంతో.. గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంతకీ కరోనాకు ఎలాంటి చికిత్స చేయాలి. ఎలాంటి మెడిసిన్ వాడాలి. మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.కరోనా ప్రపంచాన్ని చుట్టుముట్టి ఏడాది దాటింది. రోగికి ఎలాంటి చికిత్స అందించాలన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. హైడ్రాక్సీక్లోరోక్విన్.. రెమ్‌డెసివిర్ ఇలా ఒక్కసారి ఒక్కో మెడిసిన్‌ ఇస్తూ రోగులను కాపాడుతున్నా.. పక్కాగా ఇదే ట్రీట్మెంట్ అని మాత్రం లేదు.

Read More : Fake Funeral: చుట్టూ ఉన్నవాళ్లు ఏం చేస్తారో చూద్దామని ‘చనిపోయింది’!