Amit Shah: రాజకీయాల నుంచి రిటైర్‌మెంట్ తర్వాత.. నేను చేసే పనులు ఇవే..! అమిత్ షా కీలక వ్యాఖ్యలు

రసాయన ఎరువుల వాడకం వల్ల కలిగే నష్టాలను ఆయన వివరించారు. రసాయన ఎరువులతో పండించిన పంటలతో ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించారు.

Amit Shah: రాజకీయాల నుంచి రిటైర్‌మెంట్ తర్వాత.. నేను చేసే పనులు ఇవే..! అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Updated On : July 9, 2025 / 11:41 PM IST

Amit Shah: అమిత్ షా.. బీజేపీలో సీనియర్ నేత, అగ్రనాయకుల్లో ఒకరు. అంతే కాదు బీజేపీలో ఆయన చాలా పవర్ ఫుల్ నాయకుడు కూడా. ప్రధాని మోదీ తర్వాత బీజేపీలో వినిపించే పేరు అమిత్ షా. అలాంటి పవర్ ఫుల్ లీడర్.. రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తర్వాత ఏం చేయబోతున్నారు? ఆయన మనసులో ఏముంది? అసలు ఆయన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? అనేది తెలుసుకునేందుకు అందరికీ ఆసక్తి ఉంటుంది. తాజాగా దీనిపై స్వయంగా అమిత్ షా స్పందించారు.

రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తర్వాత తాను చేయబోయే పనులపై బీజేపీ కీలక నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకున్నాక తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో ఆయన రివీల్ చేశారు. ప్రజా జీవనం నుంచి వైదొలిగిన తర్వాత ఆధ్యాత్మిక జీవనం గడుపుతానని ఆయన చెప్పారు. వేదాలు, ఉపనిషత్తులు చదువుతానని వెల్లడించారు. అంతేకాదు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెడతానని అమిత్ షా అన్నారు.

గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల సహకార సంఘాల మహిళలతో అమిత్ షా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ”రాజకీయ జీవితం ముగిశాక వేదాలు, ఉపనిషత్తులను లోతుగా అధ్యయనం చేయాలనుకుంటున్నా. అలాగే స్వయంగా ప్రకృతి వ్యవసాయం చేస్తాను” అని అమిత్ షా స్పష్టం చేశారు.

Also Read: క్రియేటర్లకు బ్యాడ్ న్యూస్.. జూలై 15 నుంచి యూట్యూబ్ కొత్త రూల్స్.. ఇకపై అలాంటి ఛానెళ్లకు డబ్బులు రావు..!

వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వాడకంపై ఆందోళన వ్యక్తం చేశారు అమిత్ షా. రసాయన ఎరువుల వాడకం వల్ల కలిగే నష్టాలను ఆయన వివరించారు. రసాయన ఎరువులతో పండించిన పంటలతో ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించారు. ప్రకృతి వ్యవసాయం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా వ్యవసాయ ఉత్పాదకతను కూడా పెంచుతుందని చెప్పారు.

రసాయన ఎరువులతో పండించే పంటలతో బీపీ, థైరాయిడ్‌తో పాటు కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు, వివిధ ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు అమిత్ షా. ”ప్రకృతి వ్యవసాయం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శరీరాన్ని వ్యాధులకు దూరంగా ఉంచడంతోపాటు వ్యవసాయ
ఉత్పాదకతను పెంచుతుంది’’ అని అమిత్ షా అన్నారు. రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తర్వాత తన ఫ్యూచర్ ప్లాన్ గురించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.