ప్రతిపక్షాలు అబద్దాలు ప్రచారం చేస్తున్నాయి:మోడీ
రాజ్యసభలో ఈబీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ అవుతుందన్న నమ్మకం తనకుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. బుధవారం(జనవరి 9,2019) ఉదయం మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంతో సోలాపూర్ కనెక్టివిటీని ఇంఫ్యూవ్ చేసే నేషనల్ హైవే 211ను మోడీ ఆవిష్కరించారు. 2014లో మోడీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. మంగళవారం రాత్రి లోక్ సభలో చారిత్రాత్మక ఈబీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ అయిందని తెలిపారు. ఈ బిల్లు ప్రకారం అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడినవారికి విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు అందుతాయని, తమ సిద్దాంతం సబ్ కా సాత్ సబ్ కా వికాస్ మరింత బలపడిందని మోడీ అన్నారు. సామాజిక న్యాయానికి సంబంధించి ప్రజల ఆకాంక్షలను రాజ్యపసభ సభ్యులు గౌరవిస్తారన్న నమ్మకం తనకుందని మోడీ తెలిపారు. ప్రతిపక్షాలు అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని మోడీ ఆరోపించారు.
2014 మార్చి 31నాటికి దేశంలోని మొత్తం జాతీయ రహదారుల పొడవు 91వేల 287కిలోమీటర్లు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 1లక్షా 31వేల 326కిలోమీటర్లుగా ఉందని మోడీ తెలిపారు.