Cow Attack : ఓ మై గాడ్.. పగబట్టిన పాములా యువకుడి వెంట పడి మరీ దాడి చేసిన ఆవు.. కొమ్ములతో ఎలా కుమ్మేసిందో చూడండి

ఆవు దాడిని కళ్లారా చూసినోళ్లు షాక్ కి గురయ్యారు. భయంతో ఒళ్లంతా చెమట్లు పట్టేశాయి. Cow Attack Video

Cow Attack : ఓ మై గాడ్.. పగబట్టిన పాములా యువకుడి వెంట పడి మరీ దాడి చేసిన ఆవు.. కొమ్ములతో ఎలా కుమ్మేసిందో చూడండి

Cow Attack Video (Photo : Google)

Cow Attack Video : వీధి కుక్కలే కాదు.. పశువులు కూడా రెచ్చిపోతున్నాయి. వీధుల్లో విచ్చలవిడిగా సంచరిస్తున్న పశువులు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. సడెన్ గా దాడులకు తెగబడుతున్నాయి. కొమ్ములతో కుమ్మి కుమ్మి పడేస్తున్నాయి. ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. దేశంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో కుక్కలు, ఆవులు, ఎద్దుల దాడుల ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

తాజాగా గుజరాత్ లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ ఆవు రెచ్చిపోయింది. ఓ యువకుడిపై దాడి చేసింది. వీధుల్లో అతడిని పరిగెత్తించిన ఆవు.. కొమ్ములతో దాడి చేసి గాయపరిచింది. ఆ ఆవు తీరు చూస్తే పగబట్టిన పాములా అనిపించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Cow Attacks Girl : షాకింగ్.. రెచ్చిపోయిన ఆవు, చిన్నారిపై విచక్షణారహితంగా దాడి, కుమ్మి కుమ్మి పడేసింది.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

గుజరాత్ లోని మెహసానా జిల్లాలో ఒళ్లుగగుర్పొడిచే ఘటన చోటు చేసుకుంది. ఓ ఆవు యువకుడిని తరిమింది. వీధుల వెంబడి పరిగెత్తించింది. చాలాసేపు అతడి వెనుకే పరిగెత్తింది. ఆ తర్వాత కొమ్ములతో పొడిచి దాడి చేసింది. ఆ యువకుడు తప్పించుకుందామని ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. ఆవు వెంట పడి మరీ, పరిగెత్తించి మరీ దాడి చేసింది. అతడిని కిందపడేసి కాళ్లతో తొక్కింది.

వీధుల వెంబడి యువకుడిని పరిగెత్తించిన ఆవు కొమ్ములతో విచక్షణారహితంగా దాడి చేసింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న వ్యక్తులు ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేశారు. ఆవుని తరిమేందుకు ట్రై చేశారు. అయినా ఆవు తగ్గేదేలే అన్నట్లుగా రెచ్చిపోయింది. వారిని కూడా పొడిచేందుకు వెళ్లింది. ఈ క్రమంలో బాధితుడు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన ఆవు వెంటనే వెనక్కి తిరిగి అతడిపై మళ్లీ దాడి చేసింది. అలా చాలాసేపు ఆవు నడిరోడ్డుపై రచ్చ చేసింది.

ఆవు దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆవు దాడిని కళ్లారా చూసినోళ్లు షాక్ కి గురయ్యారు. భయంతో ఒళ్లంతా చెమట్లు పట్టేశాయి. ఆ ఆవు తీరుతో అంతా అవాక్కయ్యారు. పగబట్టిన పాములా ఆ ఆవు వ్యవహరించిందని అంటున్నారు. అయితే, రోడ్డు మీద అంతమంది వెళ్తున్నా.. ఆ ఆవు కేవలం అతడిని మాత్రమే ఎందుకు టార్గెట్ చేసింది? ఎందుకు పగబట్టిన పాములా అతడి వెంట పడి దాడి చేసింది. అనేది తెలియాల్సి ఉంది.

Also Read..Crocodile : ఇదెక్కడి విడ్డూరం రా మావా.. మొసలిని పేరుతో పిలిచి ఆహారం తినిపించడమే కాదు తలపై నిమిరాడు కూడా.. షాకింగ్ వీడియో

కాగా, దేశవ్యాప్తంగా రోడ్లపై పశువుల సంచారం పెరిగింది. రోడ్లపై విచ్చల విడిగా ఆవులు, ఎద్దులు సంచరిస్తున్నాయి. రోడ్డు మీద వెళ్లే వారిపై సడెన్ గా దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో రోడ్లపై పశువుల సంచారాన్ని అరికట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.