మతం ఆధారంగా వేరువేరు వార్డుల్లో కరోనా బాధితులు

  • Published By: vamsi ,Published On : April 15, 2020 / 03:54 AM IST
మతం ఆధారంగా వేరువేరు వార్డుల్లో కరోనా బాధితులు

Updated On : April 15, 2020 / 3:54 AM IST

కరోనా వైరస్ సోకినట్లుగా భావిస్తున్న వారిని మత విశ్వాసాల ఆధారంగా విడగొట్టి చికిత్స చేయిస్తున్నారు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో. COVID-19 కోసం 1,200 పడకలు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో  కేటాయించగా.. కరోనావైరస్ రోగులు మరియు అనుమానిత కేసులను వారి మత విశ్వాసాలను బట్టి వార్డులుగా విభజించారు.

మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ గున్వంత్ హెచ్ రాథోడ్ ఈ విషయమై మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం హిందూ రోగుల కోసం ఒక వార్డు, ముస్లిం రోగుల కోసం మరొక వార్డును రూపొందించినట్లు చెప్పారు. సాధారణంగా, స్త్రీ, పురుష రోగులకు ప్రత్యేక వార్డులు ఉంటాయని, కానీ ఇక్కడ మేము హిందూ మరియు ముస్లిం రోగులకు ప్రత్యేక వార్డులను చేసినట్లు చెప్పారు. ఇది ప్రభుత్వ నిర్ణయం  అని చెప్పారు. 

హాస్పిటలైజేషన్ ప్రోటోకాల్ ప్రకారం పరీక్షా ఫలితాలు పెండింగ్‌లో ఉన్నంతవరకు.. అనుమానించబడిన COVID-19 కేసును.. పాజిటివ్ కేసులను ప్రత్యేక వార్డులో ఉంచుతారు.  ఆస్పత్రి వర్గాల సమాచారం ప్రకారం ఆసుపత్రిలో చేరిన 186 మందిలో 150 మంది పాజిటివ్ గా ఉన్నారని, ఆ 150 మందిలో కనీసం 40 మంది ముస్లింలు ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

అయితే ఆ రాష్ట్ర డిప్యూటీ సిఎం పటేల్ మాట్లాడుతూ “అలాంటి నిర్ణయం గురించి తనకు తెలియదని పూర్తి వివరాలు సేకరిస్తాం” అని ఆయన ఆన్నారు.  అహ్మదాబాద్ కలెక్టర్ కెకె నిరాలా కూడా ఈ విషయంపై తనకు తెలియదని అన్నారు. “మా వైపు నుండి అలాంటి సూచనలు లేవు..  ప్రభుత్వ నిర్ణయం గురించి మాకు తెలియదు” అని ఆయన అన్నారు.