సరికొత్త ఆయుధాలు, లేటెస్ట్ టెక్నాలజీతో మిస్సైల్స్.. భారత రక్షణరంగం బలోపేతం
రక్షణరంగాన్ని పటిష్టం చేస్తూ చైనా ఆక్రమణలను, పాక్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టేందుకు అమ్ములపొదిలోకి దివ్యాస్త్రాలను దించేస్తోంది.

India defence production: దాపరికాలు లేవు.. దాగుడుమూతలు అంతకన్నా లేవు.. టార్గెట్ క్లియర్.. మనజోలికి రానంతవరకు ఓకే. కాదు కూడదని కాలు దువ్వితే కదనమే అంటోంది భారత్. యాక్షన్‌కు రియాక్షన్ తప్పనిసరిగా ఉంటుందని..ఈట్‌కా జవాబ్ పత్తర్ సే దేయింగే అని చెప్తోంది. మాటల్లోనే డెడ్లీ వార్నింగ్ ఇవ్వడం కాదు.. చేతల్లోనూ చూపించేందుకు రెడీ అవుతోంది. గతం గతః.. ఇకపై భారత్‌ను టచ్ చేయాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొస్తుంది. రక్షణరంగాన్ని పటిష్టం చేస్తూ చైనా ఆక్రమణలను, పాక్ కవ్వింపు చర్యలను తిప్పికొట్టేందుకు అమ్ములపొదిలోకి దివ్యాస్త్రాలను దించేస్తోంది. బ్రహ్మోస్ నుంచి అగ్ని-5 వరకు ఆర్మీలో ఆయుధాల నుంచి.. నేవీలో వెపన్స్ వరకు దేంట్లోనూ తగ్గేదేలే అంటోంది. డిఫెన్స్‌లో మేకిన్ ఇండియాను ప్రూవ్ చేస్తోంది భారత్.
ఒకప్పుడు భారత రక్షణరంగం కాస్త వీకే. అప్పట్లో ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దగ్గరున్న వెపన్స్, మిస్సైల్స్, నేవీ డిఫెన్స్ సిస్టమ్ తక్కువే. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. మనమేం తక్కువ కాదంటోంది నయా భారత్. డిఫెన్స్ ఫీల్డ్‌లో మనమేం తక్కువ కాదంటోంది. ఒక్కో అడుగు ముందుకేస్తూ.. రక్షణరంగాన్ని స్ట్రాంగ్ చేస్తోంది కేంద్రప్రభుత్వం. మన పేరెత్తితేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఒక్కో వెపన్, మిస్సైల్‌తో మన అమ్ములపొదిలోకి తిరుగులేని ఆయుధ సంపత్తి చేరుతోంది.
అన్నింటికీ ఇతర దేశాలపై ఆధారపడే స్థాయి నుంచి మనమూ సహకారం అందించే స్థాయికి ఎదుగుతున్నాం. దిగుమతులే కాదు ఎగుమతులు కూడా చేస్తున్నాం. ఇలా ఆయుధ సమీకరణే లక్ష్యంగా భారత రక్షణరంగం బలోపేతం అవుతూ వస్తోంది. సంక్షోభాలనే అవకాశాలుగా మల్చుకుని డిఫెన్స్‌లో సత్తా చాటుతోంది. దేశ రక్షణరంగ ఉత్పత్తుల్లో మరో మైల్ స్టోన్‌కు చేరుకుంది నయా భారత్. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2023-24లో 16.7 శాతం వృద్ధి రేటు పెరిగింది. రక్షణ రంగ ఉత్పత్తుల విలువ రికార్డు స్థాయిలో లక్షా 26వేల 887 కోట్లకు చేరింది.
ఆర్డర్లు పెరిగే అవకాశం..
అంతర్జాతీయ స్థాయిలో డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌ను లీడ్ చేసేలా.. అడుగులు వేస్తోంది భారత్. మునుపెన్నడూ లేనంతగా స్వదేశీ రక్షణ ఉత్పత్తుల విలువ రికార్డు స్థాయికి చేరింది. ప్రతీ ఏడాది రక్షణరంగంలో మేకిన్ ఇండియా ప్రోగ్రాం సక్సెస్ అవుతూ వస్తోంది. ఇప్పుడు భారత డిఫెన్స్ దగ్గరున్న ఆయుధాల్లో 80 శాతం మన సెల్ఫ్ మేడే. విధానపరమైన సంస్కరణలు, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పదేళ్లలో రక్షణరంగ ఉత్పత్తులు భారీగా పెరిగాయి. యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల తయారీ కోసం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్‌కు ఆర్డర్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది.
వెపన్స్, మిస్సైల్స్ మిగతా ఎక్విప్‌మెంట్ ఎగుమతి చేస్తోంది. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్‌లో రక్షణ ఎగుమతులు 21వేల 83 కోట్లకు ఎగబాకాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు 35శాతం ఎక్స్‌పోర్ట్స్ పెరిగాయి. రాబోయే పదేళ్లలో డిఫెన్స్ ఎగుమతులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. వచ్చే పదేళ్లలో అంటే 2032 నాటికి రూ.11లక్షల 45వేల కోట్లు ఎక్స్‌పోర్ట్స్ చేసే అవకాశం ఉంది. డిఫెన్స్ ఎక్విప్‌మెంట్, టెక్నాలజీలు, సర్వీసులకు డిమాండ్ పెరిగి.. రక్షణ ఉత్పత్తుల తయారీ, టెక్నాలజీ అభివృద్ధిపై పనిచేసే కంపెనీలకు మంచి భవిష్యత్ ఉండబోతుంది. రక్షణ రంగంపై భారత్ పెట్టే ఖర్చు 2029-30 నాటికి రూ.15లక్షల 50వేల కోట్లు ఉంటుందని అంచనా.
ఆపరేషన్ సముద్ర గుప్త్
ఆర్మీ, ఎయిర్ ఫోర్స్‌నే కాదు నేవీని పటిష్టం చేసి.. ఆపరేషన్ సముద్ర గుప్త్ పేరుతో శత్రు వేటను స్పీడప్ చేసింది భారత్. పోర్టు, షిప్పింగ్, జలమార్గంలో ఇప్పటివరకు ఉన్న డిఫరెన్షియల్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్‌ను అప్డేట్ చేశారు. సాగర్ సంపర్క్‌గా పిలిచే నావిగేషన్ వ్యవస్థలో లోపాలను సరి చేసి..అక్యురేట్‌గా సముద్ర మార్గాలను చూపించేలా తయారు చేశారు. ఇక కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో శత్రుదేశాల సబ్ మెరైన్లను గుర్తించి, వాటి దాడిని తప్పించుకునేందుకు మూడు కొత్త యాంటీ సబ్ మెరైన్ వెసెల్స్‌ను రెడీ చేశారు. ప్రెసిషన్ ఎటాక్ లాయిటరింగ్ సిస్టమ్. ఇది భారత్, ఇజ్రాయెల్ కలసి తయారుచేసిన మిలటరీ గ్రేడ్ ఆర్మ్‌డ్ రిమోట్లీ పైలెటెడ్ వెహికల్. దీనికి హైడెఫినేషన్ కెమెరాలు ఫిక్స్ చేసి ఉంటాయి. నావిగేషన్ సిస్టమ్ సాయంతో 100 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్‌లను ఛేజ్ చేసి అటాక్ చేస్తుంది.
Also Read : పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం.. రహస్య గదిలో 5 చెక్కపెట్టెల్లో విలువైన ఆభరణాలు
డీప్ ఓషన్ మిషన్
ఇది నేవీకి చాలా అవసరమైంది. ఈ మిషన్‌లో భాగంగా హిందూ మహాసముద్రంలో 6వేల మీటర్ల లోతు వరకు రీసెర్చ్‌లు చేయనున్నారు. సముద్ర అంతర్భాగంలో ఉన్న పాలీ మెటాలిక్ నాడ్యూల్స్ స్టడీ కోసం దీన్ని వాడుతారు. ఇక భారత రక్షణ రంగ వ్యూహంలో భాగంగా దేశ ఉత్తర సరిహద్దులను బలోపేతం చేయడానికి మరో 250 ప్రళయ్ క్షిపణి సేవలను వాడనున్నారు. ప్రళయ్ మిస్సైల్స్‌ను నేల నుంచి నింగిపైకి ప్రయోగించే రకం క్షిపణులు. ఇవి తక్కువ దూరంలోని టార్గెట్‌ను ఈజీగా ఛేజ్ చేస్తాయి. ఈ మిస్సైల్స్‌ను మొబైల్ లాంచర్లతో ప్రయోగించవచ్చు. వీటిని క్వాసీ బాలిస్టిక్ మిస్సైల్స్‌గా పిలుస్తారు. ఇవి బాలిస్టిక్, క్రూయిజ్ మిస్సైల్స్ రెండింటి లాగా పనిచేస్తాయి.