మీ కారును మీరే Infection లేకుండా చేసుకోవచ్చు.. ఎలా అంటే

  • Published By: Subhan ,Published On : June 3, 2020 / 12:01 PM IST
మీ కారును మీరే Infection లేకుండా చేసుకోవచ్చు.. ఎలా అంటే

Updated On : June 3, 2020 / 12:01 PM IST

కారును బయట మాత్రమే శుభ్రంగా ఉంచుకోవటం కాదు. లోపల భాగాల్లో ఉండే క్రిములను తొలగించటం ముఖ్యమే. దాని కోసం మీరే మీ కారుని సులువుగా డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవటం ఎలానో తెలుసుకుందాం.

Non-porous surfaces(సన్నటి రంధ్రాలు ఉన్న ఉపరితలం):

సన్నటి రంధ్రాలు ఉన్న ఉపరితలానికి ఉదాహరణకు స్టీరింగ్ వీల్, డాష్ బోర్డు, కప్ హోల్డర్ వంటి వాటిపై పేరుకున్న బాక్టీరియాలను తొలిగించటానికి సబ్బు నీటిని ఉపయోగించాలి. మెత్తటి క్లాత్ లేదా స్పాంజిని ఆ నీటిలో ముంచి మురికి పోయే వరకు శుభ్రంగా సున్నితంగా తుడవాలి. పైన చెప్పిన విధంగా శుభ్రం చేసిన తర్వాత 70 శాతం ఆల్కహాల్ ఉన్న సొల్యూషన్ తోనూ తుడవాలి.

(Note:అమోనియా, బ్లీచ్ కలిగి ఉన్న పదార్ధాలు వాడటం వల్ల మీ ఇంటిరియర్ పాడై ప్రమాదం ఉందని గమనించండి.)

Soft surfaces(మెత్తని ఉపరితలాలు):

సున్నితమైన ఉపరితలాలకు అంటే.. కారు సీట్స్. కారు సీట్లను క్లీన్ చేయటం కోసం ప్రత్యేకమైన క్లీనర్‌ను ఉపయోగించండి. లేదా ఒకవేళ సీట్ లెథర్ చాలా సునితమైనది అయితే దాని మెత్తటి క్లాత్‌తో తుడవటం మంచిది.

Electronics:
 
కారులోని డిజటల్ తలాలపై ఉన్న దుమ్ము, ధూళీ వంటి బాక్టీరియాలను తొలగించటానికి 70 శాతం ఆల్కహల్ ఉన్న లిక్విడ్ స్పేర్ చేసి మెత్తటి క్లాతుతో సున్నితంగా తుడవాలి. 

ఈ విధంగా కారును ఈజీగా శుభ్రం చేసిన తర్వాత మీ చేతులను సబ్బు లేదా హ్యాండ్ వాష్‌తో శుభ్రంగా కడుక్కోవాలి. పైన తెలిపిన విధంగా మీ కారును మీరే చాలా సులువుగా క్రిమిసంహారకం చేసుకోవచ్చు.

Read: బ్లూ లైట్‌తో భద్రం.. రాత్రి మొబైల్ వాడేవారిలోనే ఒత్తిడి ఎక్కువ : సైంటిస్టుల హెచ్చరిక