Himachal Pradesh: ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు బంపరాఫర్.. ఏకంగా రూ.50 లక్షల సబ్సిడీ

ప్రైవేటు ఆపరేటర్లకు ఎలక్ట్రిక్ బస్సు కొనుగోలు మీద 50 లక్షల రూపాయల సబ్సిడీ, ఎలక్ట్రిక్ ట్రక్కు మీద 50 లక్షల రూపాయల సబ్సిడీ, ఎలక్ట్రిక్ కారు మీద 10 లక్షల రూపాయల సబ్సిడీ ఇస్తున్న మొట్టమొదటి రాష్ట్రం మాదే. పర్యావరణం మీద మాకు ప్రత్యేక శ్రద్ధ ఉంది

Himachal Pradesh: ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు బంపరాఫర్.. ఏకంగా రూ.50 లక్షల సబ్సిడీ

Updated On : March 18, 2023 / 6:35 PM IST

Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ ఆధారిత వాహనాల ప్రోత్సాహానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీ సబ్సిడీ ప్రకటించింది. తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్‭లో విద్యుత్‭తో నడిచే బస్సు కొనుగోలు చేసే వారికి 50 లక్షల రూపాయల సబ్సిడీ ఇవ్వనున్నట్లు సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేటు ఆపరేటర్లకు కూడా ఇది వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రైవేటు ఆపరేటర్లకు కూడా ఇంత పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వం దేశంలో తమదేనని ఆయన అన్నారు. బస్సులతో పాటు ట్రక్కులకు సైతం 50 లక్షల రూపాయల సబ్సిడీ ప్రకటించారు. ఇక విద్యుత్ ఆధారిత కార్లకు 10 లక్షల రూపాయల సబ్సిడీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

Amnesty: చిన్నారి ఖైదీలపై అత్యాచారాలు, తీవ్ర హింస.. ఇరాన్‭లో మరింత పతనమవుతున్న మానవ హక్కులు

ఈ విషయమై ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు మాట్లాడుతూ.. ‘‘ప్రైవేటు ఆపరేటర్లకు ఎలక్ట్రిక్ బస్సు కొనుగోలు మీద 50 లక్షల రూపాయల సబ్సిడీ, ఎలక్ట్రిక్ ట్రక్కు మీద 50 లక్షల రూపాయల సబ్సిడీ, ఎలక్ట్రిక్ కారు మీద 10 లక్షల రూపాయల సబ్సిడీ ఇస్తున్న మొట్టమొదటి రాష్ట్రం మాదే. పర్యావరణం మీద మాకు ప్రత్యేక శ్రద్ధ ఉంది. అలాగే ప్రజా జీవనాన్ని మరింత సులభతరం చేయడంలో కూడా మాకు నిబద్ధత ఉంది. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. సబ్సిడీ పొందినవారు ఆర్థికంగా ఎదగుతారు. మరింత మంచి భవిష్యత్తును పొందుతారు’’ అని అన్నారు.

Pakistan: మాజీ ప్రధాని కోర్టుకెళ్లగానే.. ఆయన ఇంట్లోకి చొరబడి లాఠీఛార్జ్ చేసిన పోలీసులు