Prashant Kishor: బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు.. ఇద్దరి మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం..

బీహార్ సీఎం నితీష్ కుమార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. బీహార్ రాష్ట్రమంతా ప్రశాంత్ కిషోర్ యాత్రను కొనసాగిస్తున్న విషయం విధితమే. తాజాగా ఆయన సీఎం నితీష్ కుమార్‌పై మరోసారి విరుచుకుపడ్డాడు.

Prashant Kishor: బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు.. ఇద్దరి మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం..

Prasanth kishor

Updated On : October 9, 2022 / 2:02 PM IST

Prashant Kishor: బీహార్ సీఎం నితీష్ కుమార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. బీహార్ రాష్ట్రమంతా ప్రశాంత్ కిషోర్ యాత్రను కొనసాగిస్తున్న విషయం విధితమే. తాజాగా ఆయన సీఎం నితీష్ కుమార్‌పై మరోసారి విరుచుకుపడ్డాడు. జేడీ(యు)ని కాంగ్రెస్‌లో విలీనం చేయమని ప్రశాంత్ కిషోర్ తనను కోరాడని నితీష్ కుమార్ పేర్కొన్న మరుసటి రోజే ప్రశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ భ్రమపడుతున్నాడని, వయస్సు మీదపడుతుండటంతో ఆ ప్రభావం కనిపిస్తోందని, ఫలితంగా ఆయన ఏదో మాట్లాడాలని అనుకుంటాడని, కానీ ఇంకేదో మాట్లాడుతున్నాడంటూ ఎద్దేవా చేశాడు.

DMK Chief MK Stalin: డీఎంకే అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్.. రెండోసారి ఏకగ్రీవ ఎన్నిక..

ప్రస్తుతం నితీష్ కుమార్ ఎందుర్కొంటున్న సమస్యను ఇంగ్లీషులో బీయింగ్ డెల్యూషనల్ అంటారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. మొదట నేను బీజేపీ అజెండాపై పని చేస్తున్నానని చెప్పిన నితీష్, ఆ తర్వాత జేడీ(యు) పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయమని నేను తనను కోరానని పేర్కొనడం విడ్డూరంగా ఉందని అన్నారు. రెండూ ఎలా సాధ్యమయ్యాయి అంటూ ప్రశ్నించారు. నేను బీజేపీ కోసం పని చేస్తుంటే నేను ఎందుకు కాంగ్రెస్‌లో మీ పార్టీని విలీనం చేయమని బలవంతం చేస్తాను? కాంగ్రెస్? అది నిజమైతే, మొదటి ప్రకటన తప్పు అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

సీఎం నితీష్ కుమార్ రాజకీయంగా ఒంటరిగా ఉన్నాడు, అతను విశ్వసించలేని వారి చుట్టూ ఉన్నాడంటూ కిషోర్ ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడుతూ అన్నాడు. అంతకుముందు నితీష్ కుమార్ మాట్లాడుతూ.. ఒకరోజు ప్రశాంత్ కిషోర్ తన వద్దకు వచ్చి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని కోరాడని, నేను, పార్టీని ఎందుకు కాంగ్రెస్‌లో విలీనం చేయాలని ప్రశ్నించానని తెలిపాడు.