Hubli Bride : పెళ్లింట చావు మేళాలు, పెళ్లయిన నెక్ట్స్ డే వరుడు మృతి

విధి వక్రీకరించింది. పెళ్లయిన ఇంట్లో చావుబాజాలు మ్రోగాయి. ఎంతో సందడిగా ఉన్న ఆ పెళ్లయిన ఇంట్లో..ఆర్తనాదాలు వినిపించాయి. అప్పటిదాకా ఎంతో సంతోషంగా గడిపిన కుటుంబాలు తీవ్ర విషాద ఛాయలో మునిగిపోయాయి.

Hubli Bride : పెళ్లింట చావు మేళాలు, పెళ్లయిన నెక్ట్స్ డే వరుడు మృతి

Hubli

Updated On : May 3, 2021 / 10:41 AM IST

Wedding : విధి వక్రీకరించింది. పెళ్లయిన ఇంట్లో చావుబాజాలు మ్రోగాయి. ఎంతో సందడిగా ఉన్న ఆ పెళ్లయిన ఇంట్లో..ఆర్తనాదాలు వినిపించాయి. అప్పటిదాకా ఎంతో సంతోషంగా గడిపిన కుటుంబాలు తీవ్ర విషాద ఛాయలో మునిగిపోయాయి. పెళ్లయిన మరుసటి రోజే..వరుడు చనిపోవడం అందర్నీ కలిచివేసింది. ఈ ఘటన హుబ్లీలో చోటు చేసుకుంది.

హావేరి జిల్లా శిగ్గాంవి తాలూకా కలఘటిగి తాలూకా తబకహొన్నళ్లి గ్రామంలో శశి కుమార్ పట్టణ శెట్టి యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతనికి మూకబసరికట్టికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. శనివారం అతని స్వగృహంలో వివాహం ఘనంగా జరిగింది. మరుసటి రోజు అంటే ఆదివారం వధువు ఇంటికి నవ దంపతులు వెళ్లారు. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో శశికుమార్‌ కుప్పకూలి చనిపోయాడు. తమ కళ్లెదుటే…ఇది జరగడంతో అందరూ షాక్ తిన్నారు. వధువు, పెళ్లికి వచ్చిన వారు..తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Read More : Trinamool Request: తృణమూల్ రీ కౌంటింగ్ రిక్వెస్ట్ కొట్టిపారేసిన ఎలక్షన్ కమిషన్