మమత కార్యక్రమంలో…అవమానించారన్న గవర్నర్

  • Published By: venkaiahnaidu ,Published On : October 15, 2019 / 11:02 AM IST
మమత కార్యక్రమంలో…అవమానించారన్న గవర్నర్

Updated On : October 15, 2019 / 11:02 AM IST

దసరా సందర్భంగా వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ శుక్రవారం(అక్టోబర్-11,2019) ఏర్పాటు చేసిన దుర్గాపూజ కార్నివాల్ లో తనకు అవమానం జరిగిందని ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ కర్ తెలిపారు. సీఎం మమతా బెనర్జీ కూర్చున్న ప్రధాన వేదికపై తనను కూర్చోనివ్వలేదని,అంతేకాకుండా కార్నివాల్ ప్రారంభం నుంచి చివరివరకు నాలుగు గంటలపాటు తాను చూస్తుూనే ఉన్నప్పటికీ ప్రోగ్రాం కవర్ చేస్తున్న గవర్నమెంట్ అపాయింట్ చేసిన ఏజెన్సీ తనను ఒక్క సెకను కూడా టీవీలో చూపించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది తనకు జరిగిన అవమానంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. తాను చాలా బాధపడ్డానని,డిస్ట్రబ్ అయ్యానని గవర్నర్ అన్నారు. ఇలా ఎక్కడా జరగదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎవరి పేరు ప్రత్యేకంగా ప్రస్తావించకుండా మమత నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వం తన పట్ల గొప్ప అగౌరవం చూపించిందని గవర్నర్ భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. డయాస్ కార్నర్ లో గవర్నర్ ని కూర్చోబెట్టారని అన్నారు.