Viral News : వెడ్డింగ్ కేక్ వల్ల వారి పెళ్లి రద్దైంది.. ఇదేం విడ్డూరం? చదవండి
నూతన దంపతులు వెడ్డింగ్ కేక్ కట్ చేస్తున్నారు. కేక్ తనకు పూయద్దని వధువు ముందుగానే వరుడికి వార్నింగ్ ఇచ్చింది. అయినా అతను మాట వినకుండా ముఖంపై పూసాడు. ఆ తరువాత ఏం జరిగిందో చదవండి.

Viral News
Viral News : అప్పుడే పెళ్లైన కొత్త జంట వెడ్డింగ్ కేక్ కట్ చేస్తున్నారు. అంతలో వధువు వివాహాన్ని రద్దు చేసుకుంది.. ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న ఈ ఘటనలో అసలు కారణాలేంటి?
తన వివాహం రద్దు చేసుకోవడానికి గల కారణాలను ఓ అజ్ఞాత వధువు రెడ్డిట్‌లో షేర్ చేసుకుంది. ఈ సంఘటన వైరల్ అవుతోంది. కొత్తగా పెళ్లైన జంట కేక్ కట్ చేస్తున్న సమయంలో భర్త వెడ్డింగ్ కేక్‌ను తన ముఖంపై బలవంతంగా రాసిన సందర్భంలో తన మేకప్, జుట్టు, దుస్తులు అన్నీ పాడవడమే కాకుండా తనలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసాయని ఆ మహిళ పోస్టులో పేర్కొంది. అతను చేసిన పని నచ్చకపోవడంతో అతనితో మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుందట.
17 సంవత్సరాల వయసులో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో తల్లి కూడా ఇదే విధంగా ప్రవర్తించిందని తన పోస్టులో రాసుకొచ్చింది ఆ మహిళ. ఆ సమయంలో తలకు గాయమై ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చిందని తన పుట్టినరోజు మొత్తం పాడైందని చెప్పింది. తన భర్తకు ఇలాంటి పని చేస్తే వదిలేస్తానని ముందే చెప్పానని.. కానీ అతను దానిని సరదాగా తీసుకున్నాడని చెప్పింది. కేక్ కట్ సమయంలో అతను కేక్ తీసుకుని తన ముఖానికి బలవంతంగా రాసాడని వధువు రాసింది. ఈ సంఘటన చూసి తన ఫ్యామిలీతో పాటు అతని కుటుంబం జోక్ గా తీసుకున్నారని ఆమె పోస్టులో తెలిపింది. అందుకే భర్త నుంచి విడిపోయినట్లు పోస్టులో వెల్లడించింది.
మహిళ నిర్ణయాన్ని రెడ్డిట్ వినియోగదారులు సమర్థించారు. మీకు నచ్చని పనిని ముందుగానే చెప్పినా అతను వినలేదంటే జీవితాంతం అలాంటి వ్యక్తితో మీరు కలిసి నడవలేరు అంటూ అభిప్రాయం వ్యక్తం చేసారు. ప్రస్తుతం ఈ మహిళ పోస్టు వైరల్ అవుతోంది.
My husband smashed cake into my face on our wedding day and I left him.
byu/Mindless-Charge-5996 inAITAH