రిటైర్డ్ మహిళా డాక్టర్‌కు పోలీసుల వేషధారణలతో కేటుగాళ్లు వీడియో కాల్స్.. డబ్బులు ఇచ్చినా వదిలేయలేదు.. ఆమె భయంతో వణికిపోయి చివరకు..
మనీలాండరింగ్, డ్రగ్స్ సరఫరా కేసులు నమోదయ్యాయని భయపెట్టారు. వెంటనే అరెస్టు చేస్తామంటూ బెదిరించారు.

Digital Arrest
Digital Arrest: డిజిటల్ అరెస్ట్ మోసాలపై పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట పడడం లేదు. హైదరాబాద్‌లో మరో “డిజిటల్ అరెస్టు” కేసు వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరస్తుల బెదిరింపులకు భయంతో గుండెపోటు వచ్చిన ఓ రిటైర్డ్ మహిళా డాక్టర్ (75) మృతి చెందారు.
రిటైర్డ్ మహిళా డాక్టర్‌కు పోలీసుల వేషధారణలతో సైబర్ కేటుగాళ్లు వీడియో కాల్ చేసి బెదిరించారు. మనీలాండరింగ్, డ్రగ్స్ సరఫరా కేసులు నమోదయ్యాయని భయపెట్టారు. మనీలాండరింగ్ కేసు నమోదు అయిందని, వెంటనే అరెస్టు చేస్తామంటూ బెదిరించారు.
Also Read: రాహుల్ గాంధీ మరో బాంబు.. మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’.. ఈసారి సీఈసీపై డైరెక్ట్ ఎటాక్..
తాము చెప్పిన విధంగా డబ్బులు చెల్లించాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని సైబర్ చీటర్స్ అన్నారు. వారు చెప్పిన అకౌంట్లకి బాధితురాలు 6.5 లక్షల రూపాయలు పంపారు. (Digital Arrest)
అయినా కూడా వేధింపులు ఆగలేదు. మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో వృద్ధురాలికి హార్ట్ ఎటాక్ వచ్చింది. సైబర్ చీటర్స్ బెదిరింపులకు తాళలేక గుండె పేటుతో మృతి చెందింది. పోలీసులకు ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.