Hero MotoCorp: హీరో మోటోకార్ప్ ఛైర్మన్ ఇంటిపై ఐటీ దాడులు
ఇండియాలో పాపులారిటీ దక్కించుకుని టూవీలర్ విభాగంలో దూసుకుపోతోంది హీరో మోటార్స్. అధిక లాభాలతో రాణిస్తున్న హీరో మోటాకార్ప్ యజమాని ఇంటిపై బుధవారం దాడులు జరిగాయి.

Hero Motocorp
Hero MotoCorp: ఇండియాలో పాపులారిటీ దక్కించుకుని టూవీలర్ విభాగంలో దూసుకుపోతోంది హీరో మోటార్స్. అధిక లాభాలతో రాణిస్తున్న హీరో మోటాకార్ప్ యజమాని ఇంటిపై బుధవారం దాడులు జరిగాయి. ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ పవన్ ముంజాల్ ఇంటిపై తెల్లవారు జామునుంచి ఐటీశాఖ సోదాలు జరిపింది.
గురుగ్రామ్‌లోని ముంజాల్ ఇంటితో పాటు హీరో సంస్థలోని ఉన్నత స్థాయి అధికారుల ఇళ్లల్లో కూడా ఏకకాలంలో దాడులు నిర్వహించారని సమాచారం. ఐటీ దాడులకు సంబంధించి హీరో కంపెనీ కానీ, ఆదాయపు పన్ను శాఖ కానీ అధికారికంగా ఎలాంటి వివరాలు విడుదల చేయలేదు.
హీరో మోటాకార్ప్ ప్రపంచ అతిపెద్ద టూవీలర్ మ్యాన్యుఫ్యాక్చరర్ గా 2001 నుంచే ఎదిగింది. ఒక క్యాలెండర్ ఇయర్ లో ఎక్కువ వాహనాలను అమ్మిన కంపెనీగా నిలిచింది. అదే టైటిల్ ను 20సంవత్సరాలుగా మెయింటైన్ చేస్తూ వచ్చింది.
Read Also : మధ్యప్రదేశ్‌లో ఐటీ దాడులు.. అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకులో దాచిన రూ.8కోట్లు, నగలు సీజ్
ఇప్పటివరకూ డొమెస్టిక్, ఇంటర్నేషనల్ మార్కెట్లలో 100మిలియన్ యూనిట్లకు పైగా అమ్మకాలు జరిపింది. హీరో మోటోకార్ప్.. ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, మధ్య అమెరికాలోని 40 దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
ఇటీవల ఐటీ శాఖ అధికారులు ఢిల్లీ రాజధాని ప్రాంతం, చండీగఢ్, లూథియానా, లక్నో, ఇండోర్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన 45 చోట్ల సోదాలు నిర్వహించారు. ఆ సమాచారం ఆధారంగానే సోదాలు చేస్తున్నట్లు తెలిసింది.