Agri Laws: రైతు చట్టాలు రద్దు చేస్తే..లడ్డూలు తినిపిస్తా: పంజాబ్ CM స్వీట్ ఆఫర్
పంజాబ్ CM అమరీందర్ సింగ్ హర్యానా CM ఎమ్ఎల్ ఖట్టర్ కు ఓ స్వీట్ ఆఫర్ ఇచ్చారు. వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తే రైతులే కాదు నేను కూడా సీఎం ఖట్టర్‌కు లడ్డూలు తినిపిస్తానని తెలిపారు.

‘ I Will Send Laddoos
‘ I Will Send Laddoos If You Repeal Farm Laws’ : పంజాబ్ CM అమరీందర్ సింగ్ హర్యానా CM ఎమ్ఎల్ ఖట్టర్ కు ఓ స్వీట్ ఆఫర్ ఇచ్చారు. దేశ రైతులంతా వ్యతిరేకించే వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తే రైతులే కాదు నేను కూడా సీఎం ఖట్టర్‌కు లడ్డూలు తినిపిస్తానని వెల్లడించారు. వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ పంజాబ్, హర్యానాల్లోని రైతులు కొన్ని నెలలుగా ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.అయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎక్కడా పట్టించుకోవట్లేదు. సరికదా..ఆందోళన చేస్తున్న రైతులపై బీజేపీ నేతలు ఇష్టాను రీతిగా విమర్శలు చేస్తున్నారు. ఆందోళన చేసేవారు రైతులు కాదని రౌడీలు,గూండాలు అని విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో హర్యానా సీఎం ఖట్టర్ మాట్లాడుతూ..మా పక్క రాష్ట్ర సీఎం అమరీందర్, హర్యానా కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హుడా ఇద్దరూ కలిసి రాష్ట్రంలోని రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. అంతేకాకుండా అమరీందర్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ విమర్శలపై స్పందించిన అమరీందర్.. రైతులు వ్యతిరేకిస్తున్న వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తే రైతులేకాదు..నేను కూడా ఖట్టర్‌కు లడ్డూలు తినిపిస్తానని ఆఫర్ ఇచ్చారు.
తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన అమరీందర్ సింగ్ తనకు రైతులు లడ్డూ తినిపిస్తున్న ఫొటోను ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఖట్టర్‌పై మండిపడిన సీఎం కర్నాల్‌లో చెరుకు రైతులపై జరిగిన లాఠీ చార్జిని సీఎం అమరీంగర్ గుర్తు చేస్తూ..రైతులపై చేసిన లాఠీ చార్జీని ఖట్టర్ సమర్థించుకునే ప్రయత్నం చేశారంటూ తీవ్రంగా మండిపడ్డారు. ప్రశాంతంగా నిరసనలు చేస్తున్న రైతులపై పోలీసులు అన్యాయంగా దాడికి పాల్పడ్డారని అన్నం పెట్టే రైతన్నపై ఇటువంటి చర్యలు అమానుషమని ఈ ఘటన నేరపూరిత దాడి అని అమరీందర్ అభివర్ణించారు.
కేవలం దేశ వ్యాప్త రైతులే కాదు మీ సొంతరాష్ట్ర రైతులే మీమీద ఆగ్రహంగా ఉన్నారనే విషయం మీకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసే విషయంలో మీ పార్టీ మొండితనం, రైతుల విషయంలో మీ నిర్లక్ష్యమే దానికి కారణ అని విమర్శించారు. మాపై నిందలు వేసే ముందు వ్యవసాయ రంగాన్ని నిప్పుల కొలిమి నుంచి రక్షించడం కోసం వ్యవసాయ చట్టాలు రద్దు చేయండి’’ అంటూ ఖట్టర్‌కు పంజాబ్ సీఎం అమరీందర్ సిగ్ సలహా ఇచ్చారు.
రైతులు మనుగడ కోసం పోరాడుతున్నారనే విషయం బీజేపీ గుర్తు పెట్టుకుకోవాలని..తీవ్రంగా నష్టపోతున్న రైతులను ఆదుకోకుండా వారిపై నిందలు మోపుతూ..దాడులు చేయిస్తుంటే వారి కడుపు మండి ఆందోళనలు చేస్తున్నారని అటువంటివారిని ఎవ్వరూ రెచ్చగొట్టాల్సిన అవసరం లేదని..తాము ఎప్పుడు రైతుల పక్షమేనని సీఎం అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు.