IAF Chopper Crash : నాన్నా.. నేనూ ఆర్మీలో చేరుతా! అమర జవాన్ టోపీ ధరించి కొడుకు సెల్యూట్.. వీడియో వైరల్

కూతురు, కొడుకు అవిరాజ్ లు తండ్రి పార్థీవదేహానికి నివాళులర్పించారు. ఈ సమయంలో తండ్రి వింగ్ కమాండర్ పృథ్వీసింగ్ తలపై ఉన్న ఆర్మీ టోపీని తీసుకుని...

IAF Chopper Crash : నాన్నా.. నేనూ ఆర్మీలో చేరుతా! అమర జవాన్ టోపీ ధరించి కొడుకు సెల్యూట్.. వీడియో వైరల్

Iaf Chopper

Updated On : December 12, 2021 / 7:36 AM IST

Wing Commander Prithvi Singh Last Rites : తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ దుర్ఘటన అందర్నీ కలిచివేసింది. ఈ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులతో సహా…13 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనతో భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కన్నీటి నివాళులు అర్పించింది. ఘటనలో మృతి చెందిన జవాన్లను గుర్తు పట్టేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన అనంతరం వారి వారి కుటుంబాలకు భౌతికకాయాలను అందించింది. మరణించిన సిబ్బందిలో వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ కూడా ఉన్నారు. ఆయన పార్థీవదేహాన్ని కుటుంబీలకు ఆర్మీ సిబ్బంది అందచేసింది. కుటుంబసభ్యులు కన్నీటి నివాళులర్పించింది.

Read More : Modi Twitter : పీఎం మోదీ ట్విట్టర్ హ్యాక్

పృథ్వీ సింగ్ కు కుమార్తె ఆరాధ్య, కుమారుడు అవిరాజ్ లున్నారు. తండ్రి చివరి చూపు కోసం కుటుంబంతో వీరు కూడా వచ్చారు. అయితే..ఆ సమయంలో గుండె బరువెక్కించే ఘటన ఒకటి చోటు చేసుకుంది. కూతురు, కొడుకు అవిరాజ్ లు తండ్రి పార్థీవదేహానికి నివాళులర్పించారు. ఈ సమయంలో తండ్రి వింగ్ కమాండర్ పృథ్వీసింగ్ తలపై ఉన్న ఆర్మీ టోపీని తీసుకుని తలపై పెట్టుకుని సెల్యూట్ చేశాడు అవిరాజ్. పక్కనే ఉన్న ఆరాధ్య తలపై కూడా ఆయన ఆర్మీ టోపీని ఉంచారు. ఈ సమయంలో అక్కడున్న వారు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

Read More : BWF World Championships : ప్రపంచ బ్యాడ్మింటన్..అందరి చూపు సింధు వైపు

వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. ఆయన మరణం పట్ల సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి, సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబాన్ని ఆయన శుక్రవారం కలిశారు. పృథ్వీ సింగ్ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, రూ. 50 లక్షలు, ఓ సంస్థకు ఆయన పేరు పెడుతుందని సీఎం వెల్లడించారు.