Modi Twitter : పీఎం మోదీ ట్విట్టర్ హ్యాక్

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్టర్ హ్యాక్ అయ్యింది. బిట్ కాయిన్ లు కొనాలంటూ...ఆగంతుకులు ట్వీట్ చేశారు. బిట్ కాయిన్ లు లీగల్ చేశామంటూ...మెసేజ్ లు చేయడం కలకలం రేపుతుతోంది.

Modi Twitter : పీఎం మోదీ ట్విట్టర్ హ్యాక్

Modi Tweet (1)

Modi’s Twitter Account Hacked : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్టర్ హ్యాక్ అయ్యింది. బిట్ కాయిన్ లు కొనాలంటూ…ఆగంతకులు ట్వీట్ చేశారు. బిట్ కాయిన్ లు లీగల్ చేశామంటూ…మెసేజ్ లు చేయడం కలకలం రేపింది. 500 బిట్ కాయిన్ లు పంచుతున్నామంటూ…హ్యాకర్లు ట్వీట్ చేశారు. హ్యాకర్ల ట్వీట్ పై పీఎంవో అధికారులు రెస్పాండ్ అయ్యారు. ప్రధాని ట్విట్టర్ అకౌంట్ ను రీస్టోర్ చేసింది ట్విట్టర్.

Read More : Gold Price Today : బంగారం ధర ప్రియం.. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరలు ఇలా

ఇటీవలే..పలువురు ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్ లు హ్యాక్ కు గురైన సంగతి తెలిసిందే. అయితే…భారత ప్రధాన మంత్రి మోదీ ట్విట్టర్ ఖాతాను ఆదివారం ఉదయం 2 గంటల ప్రాంతంలో హ్యాకర్స్ హ్యాక్ చేయడం సంచలనం రేకెత్తించింది. ఈ విషయాన్ని పీఎంవో వర్గాలు తెలుసుకున్నాయి. ఆదివారం ఉదయం 3 గంటల ప్రాంతంలో ట్విట్టర్ కు తెలియచేయడం జరిగిందని పీఎంవో వర్గాలు వెల్లడించాయి. వెంటనే ట్విట్టర్ స్పందించి…రీస్టోర్ చేసిందని తెలిపింది. ఖాతా హ్యాక్ అయిన సమయంలో…ఏదైనా మెసేజ్ వస్తే వదిలేయాలని పేర్కొంది.

Read More : BWF World Championships : ప్రపంచ బ్యాడ్మింటన్..అందరి చూపు సింధు వైపు

గత కొన్ని రోజులుగా బిట్ కాయిన్ పై రగడ చెలరేగుతున్న సంగతి తెలిసిందే. బిట్ కాయిన్ అనేది ఒక క్రిఫ్టో కరెన్సీ. క్రిప్టో కరెన్సీ విషయంలో…సరైన నిర్ణయం తీసుకోవాలని మోదీ గవర్నమెంట్ భావిస్తోంది. పార్లమెంట్ సమావేశాల్లో బిట్ కాయిన్ పై స్పష్టమైన ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బిట్ కాయిన్ ను కరెన్సీగా గుర్తించలేమని, కాయిన్ లావాదేవీలకు సంబంధించి సమాచారాన్ని సేకరించామన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు.