వేస్తే..అంతే : IAFకు శక్తివంతమైన స్పైస్-2000 బాంబులు వచ్చేశాయ్

  • Published By: venkaiahnaidu ,Published On : September 16, 2019 / 10:07 AM IST
వేస్తే..అంతే : IAFకు శక్తివంతమైన స్పైస్-2000 బాంబులు వచ్చేశాయ్

Updated On : September 16, 2019 / 10:07 AM IST

బిల్డింగ్ లను సైతం ఈజీగా నేలమట్టం చేయగల శక్తివంతమైన స్పైస్- 2000 బాంబులు భారత అమ్ములపొదిలో చేరాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యవసరంగా ఈ ఏడాది జూన్‌ లో బాంబుల కొనుగోలుకు ఇజ్రాయెల్‌ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇజ్రాయెల్ తో భారత్ కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా మొదటి విడత స్పైస్- 2000 బాంబులు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ లోని వైమానిక కేంద్రానికి వచ్చాయి. ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ నుంచి మరిన్ని బాంబులు రానున్నాయి. 

ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా సరిహద్దు దాటి పాకిస్తాన్ లోని బాలాకోట్ లో ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన స్పైస్ -2000 బాంబులతోనే దాడి చేసిన విషయం తెలిసిందే. మిరాజ్ యుద్ద విమానాల నుంచి స్పైస్ -2000 బాంబులను వాయుసేన ఉగ్ర శిబిరాలపై వేసి ధ్వంసం చేసింది. ఎక్కువ బరువు వల్ల ఈ బాంబులు భవనం పైకప్పును చీల్చుకుని లోపలికి చేరగలవు.

పెద్ద పెద్ద బిల్డింగ్ లను సులభంగా నేలమట్టం చేసే సత్తా ఈ బాంబులకు ఉంది. భారత్ తో యుద్ధం చేస్తాం అంటూ పాక్ కయ్యానికి కాలుదువ్వుతున్న సమయంలోఉ గ్రవాద శిబిరాలను స్పైస్ 2000 బాంబులతోనే పేల్చివేసిన వాయుసేన..మరిన్ని బాంబులను కొనుగోలు చేసి పాక్‌ కి షాకిచ్చింది.