BrahMos missile: బ్రహ్మోస్ క్షిపణి లక్ష్య పరిధిని పెంచి భారత్ ప్రయోగం.. విజయవంతం

యుద్ధ విమానాల నుంచి ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణి లక్ష్య పరిధిని పెంచి భారత్ ఇవాళ చేసిన ప్రయోగం విజయవంతమైంది. 400 కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత లక్ష్యాన్ని అది ఛేదించిందని రక్షణ శాఖ అధికారులు చెప్పారు. ఎస్యూ-30 యుద్ధ విమానం నుంచి ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణి నిర్దేశిత ఓడను ధ్వంసం చేసిందని తెలిపారు. ఇది గగనతలం నుంచి నౌకలను ధ్వంసం చేయగలిగే వెర్షన్ క్షిపణి అని చెప్పారు.

BrahMos missile: బ్రహ్మోస్ క్షిపణి లక్ష్య పరిధిని పెంచి భారత్ ప్రయోగం.. విజయవంతం

BrahMos missile

Updated On : December 29, 2022 / 7:25 PM IST

BrahMos missile: యుద్ధ విమానాల నుంచి ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణి లక్ష్య పరిధిని పెంచి భారత్ ఇవాళ చేసిన ప్రయోగం విజయవంతమైంది. 400 కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత లక్ష్యాన్ని అది ఛేదించిందని రక్షణ శాఖ అధికారులు చెప్పారు. ఎస్యూ-30 యుద్ధ విమానం నుంచి ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణి నిర్దేశిత ఓడను ధ్వంసం చేసిందని తెలిపారు. ఇది గగనతలం నుంచి నౌకలను ధ్వంసం చేయగలిగే వెర్షన్ క్షిపణి అని చెప్పారు.

బంగాళాఖాతంలోని నిర్దేశిత లక్ష్యాన్ని ఈ క్షిపణి కచ్చితత్వంతో ఛేదించిందని వివరించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో.. ఎస్యూ-30ఎంకేఐ యుద్ధ విమానాల నుంచి భూతల, సముద్రతల సుదీర్ఘ లక్ష్యాలను మరింత కచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యం భారతీయ వైమానిక దళం సంపాదించినట్లయిందని అధికారులు తెలిపారు.

భారతీయ వైమానిక దళం వ్యూహాత్మకంగా తమ లక్ష్యాలను ఛేదించడానికి, భవిష్యత్తుల్లో యుద్ధాల్లో శత్రుదేశాలపై పై చేయి సాధించడానికి ఈ కొత్త వెర్షన్ బ్రహ్మోస్ క్షిపణి మరింత ఉపయోగపడుతుందని వివరించారు. ఈ ప్రయోగం చేపట్టడానికి భారత వైమానిక దళం, నౌకా దళం, డీఆర్డీవో, బీఏపీఎల్, హల్ కృషి చేశాయని చెప్పారు. బ్రహ్మోస్ క్షిపణి లక్ష్య పరిధిని పెంచుకుంటూ భారత్ ఇప్పటికే అనేక విజయాలు సాధించింది. ఈ ఏడాది మేలోనూ ఎస్యూ-30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి భారత్ బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం చేపట్టి విజయవంతమైంది.

iPhone 12 Pro : ప్రమాదవశాత్తూ 26వ ఫ్లోర్ నుంచి జారి పడిన ఆపిల్ ఐఫోన్ 12 ప్రో.. ఆ తర్వాత ఏమైందో తెలిస్తే షాకవుతారు..!