పాక్‌పై దాడులను సమర్ధించిన ఓవైసీ : మోడీది సరైన నిర్ణయం

ఢిల్లీ: పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన సర్జికల్ ఎటాక్‌ను ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్వాగతించారు. పాక్‌పై దాడులను ఆయన సమర్థించారు. ప్రధాని మోడీ నిర్ణయం సరైనదే అన్నారు. పుల్వామా దాడి తర్వాత 2, 3 రోజుల్లోనే భారత్ ప్రతీకార దాడి చేస్తుందని భావించానని అన్నారు. ఆలస్యమైనా సర్జికల్ దాడిని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వానికి మా పూర్తి మద్దతు ఉంటుందని అసద్ చెప్పారు. విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఈ దాడిని సైనికేతర చర్యగా చెబుతున్నప్పటికీ, ప్రభుత్వం నుంచి ఇటువంటి నిర్ణయాన్ని నేనెప్పుడో ఊహించానని అసద్ అన్నారు. ఇప్పుడు ఉగ్రవాద సంస్థల అధినేతలు మసూద్ అజార్, హఫీజ్ సయీద్‌ల వేటను ప్రభుత్వం మొదలుపెడుతుందని తాను భావిస్తున్నానని అసదుద్దీన్ అన్నారు.
Also Read : దేశవ్యాప్తంగా హైఅలర్ట్: ఉగ్రదాడులు జరగొచ్చని ఐబీ వార్నింగ్
పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఫిబ్రవరి 14న జరిగిన ఆత్మాహుతి దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమితి కశ్మీర్‌తో పాటు పాక్ భూభాగంలోని జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం దాడులు చేసింది. మంగళవారం(ఫిబ్రవరి 26) తెల్లవారుజామున వాయుసేన యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోని బాలాకోట్‌లో ఉన్న జైషే మహమ్మద్ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ముష్కర మూకల శిబిరాలను నేలమట్టం చేయడంతో పాటు 245మంది టెర్రరిస్టులను మట్టుబెట్టారు. భారత వాయుసేన జరిపిన ఈ ప్రతీకార దాడిపట్ల యావత్ భారతదేశం హర్షం వ్యక్తం చేస్తోంది.
Also Read : బుద్ధిమారదు అంతే : పాకిస్థాన్ కు చిల్లిగవ్వ ఇచ్చేదిలేదు
ఉరి ఉగ్రదాడి తర్వాత భూభాగం ద్వారా ఎల్‌ఓసీని దాటి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో సర్జికల్ దాడులు నిర్వహించిన భారత ఆర్మీ.. ఈసారి మాత్రం గగనతలం ద్వారా పాక్ భూభాగంలోకి అడుగుపెట్టింది. నియంత్రణ రేఖ నుంచి 50కిలోమీటర్ల దూరంలో పాక్ భూభాగంలోని బాలాకోట్ ప్రాంతంలో జైషే మహమ్మద్‌కు చెందిన ఉగ్రవాద శిక్షణ శిబిరాలను ధ్వంసం చేసింది.
A Owaisi: Was expecting this sort of response within 2-3 days after Pulwama blast. Welcome this. We stand with govt. Though Foreign Secy called it non-military action,it’s a step I was expecting govt will take long time back. I hope govt will now go after Masood Azhar&Hafiz Saeed pic.twitter.com/eYgHAfrt7c
— ANI (@ANI) February 26, 2019
Also Read :అప్పటి విమానం హైజాక్ తీవ్రవాది.. ఈ దాడుల్లో చచ్చాడు
Also Read : అర్థరాత్రి యుద్ధం : పాక్ విమానాలు వెంటాడినా.. భారత్ పైటర్లు చిక్కలేదా!