Omicron detection Kit : ఒమిక్రాన్ గుర్తించే సరికొత్త కిట్..
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఒమిక్రాన్ కేసులు కూడా క్రమంగా పెరిగిపోతున్నాయి.

Icmr Designs Kit For Omicron Detection
Omicron Detection Kit : దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఒమిక్రాన్ కేసులు కూడా క్రమంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించేందుకు సరికొత్త కిట్ అందుబాటులోకి రానుంది. ICMR ఈ ఒమిక్రాన్ డిటెక్షన్ కిట్ రూపొందించింది. ఈ కిట్ కమర్షియల్‌గా ఉత్పత్తి చేసేందుకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్– EMI) బిడ్లను ఐసీఎంఆర్ ఆహ్వానించింది. ఐవీడీ కిట్ తయారీదారులకు ఈ ఇన్విట్రో కిట్లకు(IVD) కావాల్సిన టెక్నాలజీని సంస్థ ట్రాన్స్ఫర్ చేయనుంది.
కొత్త టెక్నాలజీతో రియల్ టైం RT-PCR TEST KIT.. తమ అధీనంలో ICMR రీజనల్ మెడికల్ రిసెర్చ్ సెంటర్ ద్వారా తయారుచేసింది. ఐసీఎంఆర్ కిట్ల టెక్నాలజీ, ఐపీ రైట్స్, వాణిజ్య హక్కులు సంస్థ తమ దగ్గరే ఉంచుకుందని అంటున్నారు. ఎంపిక చేసిన ఉత్పత్తి చేసేదారులతో లైసెన్సు అగ్రిమెంట్లను సంస్థ కుదుర్చుకుంది.
ఒప్పందం నేపథ్యంలో అవసరమైన టెక్నాలజీని ట్రాన్స్ ఫర్ చేస్తుందని ఐసీఎంఆర్ తెలిపింది. ప్రస్తుతం ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు జీనోమ్ స్వీకెన్సింగ్ విధానాన్ని వినియోగిస్తున్నారు. ఈ ఒమిక్రాన్ డిటెక్షన్ కిట్.. చాలా ఖరీదైనది. కాకపోతే టెస్టు ఫలితాలు రావాడానికి చాలా సమయం పడుతుందని అంటున్నారు.
మరోవైపు.. తెలంగాణలో ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో సౌతాఫ్రికా వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. మొత్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 21కి చేరింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఒమిక్రాన్ కేసు నమోదు అయింది. దుబాయ్ నుండి స్వగ్రామం గూడెంకు వచ్చిన వ్యక్తిని హైదరాబాద్ టిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
అతనికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారించారు. బాధితుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. జిల్లాలో తొలి కేసు నమోదు కావడంతో వైద్య అధికార బృందం అప్రమత్తమైంది. కట్టడికి తగు చర్యలు తీసుకుంటుంది. కాగా విదేశాల నుంచి వచ్చిన 10 మందికి.. రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఇద్దరికి డిసెంబర్ 18న పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.
Read Also : Omicron Covid Variant: డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్‌కు వేగమెక్కువ – WHO