Jairam Ramesh: అదానీకి గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రయోజనాలు ఏంటి?: జైరాం రమేశ్

పారిశ్రామికవేత్త అదానీకి గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రయోజనాలు ఏంటి అని ఏఐసీసీ జాతీయ కార్యదర్శి జైరాం రమేశ్ ప్రశ్నించారు. అదానీ గ్రూప్ వ్యవహారంలో దాచి పెట్టేందుకు ఏదీ లేకపోతే మరి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోతోందని నిలదీశారు. అదానీ విషయంలో దాచి పెట్టేందుకు ఏదీ లేదంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై జైరాం రమేశ్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

Jairam Ramesh: అదానీకి గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రయోజనాలు ఏంటి?: జైరాం రమేశ్

AICC President election

Updated On : February 14, 2023 / 3:57 PM IST

Jairam Ramesh: పారిశ్రామికవేత్త అదానీకి గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రయోజనాలు ఏంటి అని ఏఐసీసీ జాతీయ కార్యదర్శి జైరాం రమేశ్ ప్రశ్నించారు. అదానీ గ్రూప్ వ్యవహారంలో దాచి పెట్టేందుకు ఏదీ లేకపోతే మరి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై సమాధానం చెప్పకుండా ఎందుకు పారిపోతోందని నిలదీశారు. అదానీ విషయంలో దాచి పెట్టేందుకు ఏదీ లేదంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై జైరాం రమేశ్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయడంపైనే కాకుండా పార్లమెంటులో దానిపై చర్చించేందుకు కూడా బీజేపీ అంగీకరించడం లేదని జైరాం రమేశ్ అన్నారు. ఈ విషయాన్ని లోక్ సభలో తమ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ, రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేవనెత్తారని చెప్పారు.

జేపీసీని ఏర్పాటు చేసి, అదానీ వ్యవహారంపై, హిండెన్ బర్గ్ నివేదికపై విచారణ జరిపించాలని తాము డిమాండ్ చేస్తున్నామని జైరాం రమేశ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, అదానీ గ్రూప్ నకు మధ్య ఉన్న సంబంధం ఏంటని ఆయన నిలదీశారు. కాగా, అదానీ గ్రూప్ వ్యవహారంపై పార్లమెంటులో చర్చకు ప్రతిపక్ష పార్టీలు ఎంతగా పట్టుబడుతున్నా దానిపై చర్చించేందుకు కేంద్ర సర్కారు సుముఖత చూపడం లేదు. దీంతో పార్లమెంటులో ప్రతిరోజు గందరగోళం నెలకొంటోంది.

BJP MLC Candidates: ఎమ్మెల్సీ అభ్యర్థుల వివరాల్ని ప్రకటించిన బీజేపీ.. తెలంగాణలో ఒకరు… ఏపీలో ముగ్గురి పేర్లు ఖరారు