Nana Patole: రాహుల్ సంకోచిస్తే గెహ్లోతే కాంగ్రెస్ అధ్యక్షుడు: కాంగ్రెస్ నేత
భారతీయ జనతా పార్టీ వారసత్వ రాజకీయంటూ చేసే విమర్శలపై పటోలే స్పందిస్తూ ‘‘మమ్మల్ని వారసత్వ రాజకీయాలు అని నిందిచే వారే.. నాగ్‌పూర్‌లో కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నాగ్‌పూర్ నుంచి వచ్చే ఆదేశాల అనుసారమే బీజేపీ దేశాన్ని పాలిస్తుంది. కానీ కాంగ్రెస్ అలా కాదు. పార్టీ అధినేత ఆదేశాలకు కట్టుబడి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం ఏర్పడితే ఆ ప్రభుత్వాధినేత ఆదేశాలే పని చేస్తాయి’’ అని అన్నారు.

If Rahul reluctant Gehlot can become Congress president says Nana Patole
Nana Patole: రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవ్వడం ఇష్టం లేకపోతే రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోతే పార్టీ అధినేత అవుతారని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్యం అలాంటిదని, గాంధీ కుటుంబం మాత్రమే పార్టీని నడిస్తుందని అనకుంటే పొరపాటని ఆయన గుర్తు చేశారు. పార్టీ నుంచి అనేక మంది గాంధీయేతరులు అధ్యక్షులు, ప్రధానమంత్రులు అయ్యారని, అయితే అది వారి వారి సామర్థ్యాలను బట్టి ఉంటుందని పటోలే అన్నారు.
గురువారం ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ‘‘వాస్తవానికి ఇది పార్టీ అంతర్గత వ్యవహారం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యేందుకు రాహుల్ గాంధీ ఇష్టపడకపోవచ్చు. వాస్తవానికి ఆయన తప్పుకుంటున్నట్లు మీడియాలో చెప్తున్నారు. ఇలా జరిగితే అశోక్ గెహ్లోత్ అధ్యక్షుడు అయితే అభ్యంతరం ఏంటి? పార్టీలో ఎవరికీ అభ్యంతరం ఉందడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆ రకమైన ప్రజాస్వామ్యం ఉంది’’ అని పటోలే అన్నారు.
ఇకా భారతీయ జనతా పార్టీ వారసత్వ రాజకీయంటూ చేసే విమర్శలపై పటోలే స్పందిస్తూ ‘‘మమ్మల్ని వారసత్వ రాజకీయాలు అని నిందిచే వారే.. నాగ్‌పూర్‌లో కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నాగ్‌పూర్ నుంచి వచ్చే ఆదేశాల అనుసారమే బీజేపీ దేశాన్ని పాలిస్తుంది. కానీ కాంగ్రెస్ అలా కాదు. పార్టీ అధినేత ఆదేశాలకు కట్టుబడి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం ఏర్పడితే ఆ ప్రభుత్వాధినేత ఆదేశాలే పని చేస్తాయి’’ అని అన్నారు.