worlds largest sqirrel : ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఉడుత .. భారత్ అడవుల్లో గుర్తింపు

ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఉడుత.అత్యంత పొడవైన ఉడుతల జాతికి చెందినది.

worlds largest sqirrel : ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఉడుత .. భారత్ అడవుల్లో గుర్తింపు

worlds largest sqirrel 

worlds largest sqirrel  In India: ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఉడుత అంటూ ఐఎఫ్‌ఎస్ అధికారి (IFS officer) ప్రవీణ్‌ కాస్వాన్‌ (Praveen Kaswan).. ఓ ఉడుత ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇది సాధారణ ఉడుత కాదట..అరుదైన జాతికి చెందినదని..ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఉడుతల జాతికి చెందినదిగా గుర్తింపు పొందిన ఉడుత అని వెల్లడించారు. నలుపు, కాఫీపొడి రంగులో ఉండే ఈ ఉడుత జాతిని మన దేశంలోనే గుర్తించారు.

పశ్చిమబెంగాల్‌(West Bengal)లోని బుక్సా (Buxa) టైగర్‌ రిజర్వ్‌లో తీసిన ఈ ఉడుత ఫొటోను ప్రవీణ్‌ కాస్వాన్‌ తాజాగా ట్విటర్‌లో షేర్‌ చేశారు. ప్రపంచంలోనే అతి పొడవైన ఈ ఉడుత జాతిని భారతదేశంలోనే గుర్తించారని పేర్కొన్నారు. మీరు దీన్ని గుర్తుపట్టగలరా..? అంటూ ప్రశ్నించారు. ఆ పక్కనే బుక్సా ప్రాంతం పేరు ప్రస్తావించారు. ఈ ఉడుత ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఫొటోపై నెటిజన్‌ల నుంచి కామెంట్లు చేస్తు.. చాలా బాగుంది కొన్నేళ్ల క్రితం తిరుపతి పర్యటనలో ఇటువంటివాటిని చూశాను. ముంబైలో 10-15 సంవత్సరాల క్రితం వెర్సోవా అంథేరీ వెస్ట్ లో కూడా చూశానని ఇంకొకరు కామెంట్స్ చేశారు. అలా ఇది మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కొంకణ్ లోని పశ్చి కనుమల ప్రాంతానికి ప్రత్యేకమైనది అభిప్రాయపడ్డారు.