IFS Vivek Kumar: ప్రధాని మోదీ ప్రైవేట్ సెక్రటరీగా ఐఎఫ్ఎస్ అధికారి వివేక్ కుమార్ నియామకం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)గా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి వివేక్ కుమార్ నియమితులయ్యారు.

IFS Vivek Kumar: ప్రధాని మోదీ ప్రైవేట్ సెక్రటరీగా ఐఎఫ్ఎస్ అధికారి వివేక్ కుమార్ నియామకం

Ifs

Updated On : May 22, 2022 / 4:53 PM IST

IFS Vivek Kumar: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)గా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి వివేక్ కుమార్ నియమితులయ్యారు. జాయింట్ సెక్రటరీ స్థాయిలో ప్రధాన మంత్రికి ప్రైవేట్ సెక్రటరీగా సేవలు అందించనున్నారు. ఈమేరకు శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. వివేక్ కుమార్ ను మోదీకి పీఎస్ గా నియమించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. వివేక్ కుమార్, ఐఎఫ్ఎస్ ను ప్రధానమంత్రి కార్యాలయంలో జాయింట్ సెక్రటరీ స్థాయిలో నియమించే ప్రతిపాదనకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది.

Other Stories:Lakshya Sen met Modi: ప్రధాని మోదీ అడిగిన ఆ ‘చిన్ని కోరిక’ తీర్చిన భారత స్టార్ షట్లర్

2004 ఐఎఫ్ఎస్ బ్యాచ్ కి చెందిన వివేక్ కుమార్ 2014లో ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా చేరాడు. ఐఐటీ బాంబే నుంచి కెమికల్ ఇంజినీరింగ్ లో B.Tech పూర్తిచేసి రష్యా, ఆస్ట్రేలియాల్లో దౌత్యపరమైన పదవుల్లో పనిచేశారు. ఈ నియామకానికి ముందు..ప్రధాని కార్యాలయానికి డైరెక్టర్ గా పనిచేశారు వివేక్ కుమార్.

Other Stories:Amit Shah to Rahul Gandhi: ఇటలీ కళ్లద్దాలు తీసేయండి.. రాహుల్‌కు అమిత్ షా చురక