Ignou : రెండు కొత్త కోర్సులు ప్రారంభించిన ఇగ్నో

ఆరునెలలపాటు స్పానిష్ సర్టిఫికెట్ కోర్సు అభ్యసన వ్యవధికాలం ఉంటుంది. దీనికి సంభందించి ఫీజును 4500 రూపాయలుగా నిర్ణయించారు.

Ignou : రెండు కొత్త కోర్సులు ప్రారంభించిన ఇగ్నో

Ignou

Updated On : February 18, 2022 / 3:14 PM IST

Ignou : ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ ఫారెన్ లాంగ్వేజస్ లో రెండు కొత్త కోర్సులను ప్రారంభించింది. 2022 జనవరి సెషన్ కు సంబంధించి స్పానిష్, ఫ్రెంచ్ భాషల్లో సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ను ఆన్ లైన్ విధానంలో భోధించనుంది. ఈ రెండు భాషలను చదవడం, రాయడం, వినటం, మాట్లాడటంతోపాటు నైపుణ్యాలను ఈ ఆన్ లైన్ విధానం ద్వారా అందిస్తారు.

ఆరునెలలపాటు స్పానిష్ సర్టిఫికెట్ కోర్సు అభ్యసన వ్యవధికాలం ఉంటుంది. దీనికి సంభందించి ఫీజును 4500 రూపాయలుగా నిర్ణయించారు. రోజు వారి కార్యకలాపాలను స్పానిష్ భాషలో సాగించేందుకు వీలుగా కోర్సు కొనసాగనుంది. ఉచ్ఛారణ, వ్యాకరణం, పదజాలం, ప్రాధమిక సంభాషణ నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు ఈ కోర్సు దోహదపడనుంది.

ఫ్రెంచ్ భాషకు సంబంధించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అధారంగా ఈ కోర్సును రూపొందించారు. ఈకోర్సులో ప్రవేశం కావాల్సిన వారు 6,600 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు ignouiop.samarth.edu.in  ను సంప్రదించాల్సి ఉంటుంది.