Cabinet Revamp : పలువురికి ప్రమోషన్..కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా!

కేంద్ర కేబినెట్ విస్తరణకు సర్వం సిద్ధమైంది.

Cabinet Revamp : పలువురికి ప్రమోషన్..కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా!

Kishan

Updated On : July 7, 2021 / 4:04 PM IST

Cabinet Revamp కేంద్ర కేబినెట్ విస్తరణకు సర్వం సిద్ధమైంది. నరేంద్రమోడీ రెండవసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కేబినెట్ విస్తరణ చేపట్టనున్నారు. కీలక మంత్రిత్వ శాఖలు రక్షణ,హోం, ఆర్ధిక,రోడ్లు రహదారులు మినహా మెజారిటీ శాఖల మంత్రులు మారనున్నారు.

22 మంది కొత్త వారికి ఈసారి మంత్రులుగా అవకాశం ఇచ్చిన్నట్లు సమాచారం. పాత, కొత్త మంత్రులు కలిసి మొత్తం 43 మంది ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఆరు గంటలకు రాష్ట్రపతి భనన్‌లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీని కోసం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు

మెరుగైన పనితీరు కనబర్చిన పలువురు సహాయ మంత్రులకు ప్రమోషన్ దక్కనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వున్న పలువురు రాష్ట్ర మంత్రులను కేబినెట్ స్థాయికి ప్రమోషన్ పొందనున్నారు. ప్రమోషన్ అందుకోబోతున్న మంత్రుల్లో కిషన్ రెడ్డి,హర్దీప్ సింగ్ పూరి,పురుషోత్తమ్ రూపాల,మనుష్ మాండవ్య,కిరణ్ రిజిజు,అనురాగ్ ఠాకూర్ ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో కొందరు..ఇవాళ కొత్తగా మంత్రులుగా ప్రయాణ స్వీకారం చేయబోయే వారితో కలిసి ప్రధాని నివాసంలో జరిగిన భేటీలో దర్శనమిచ్చారు.

కిరణ్ రిజిజు..ప్రస్తుతం కేంద్ర క్రీడాశాఖ సహాయశాఖ మంత్రిగా ఉన్నారు. హర్దీప్ సింగ్ పూరీ..విమానయానశాఖ ఇంఛార్జిగా ఉన్నారు. అనురాగ్ ఠాకూర్.. కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. జీ కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. పురుషోత్తం రూపాల..పంచాయతీ రాజ్ శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.

ఇక,కొత్త వాళ్లకు కేబినెట్ లో చోటు కల్పించే క్రమంలో ఇప్పటికే కేబినెట్ లో ఉన్న పలువురు నేతలకు ఉద్వాసన పలుకుతున్నారు. ఇవాళ పలువురు కేంద్రమంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డా. హర్షవర్ధన్,కార్మికశాఖ సహాయ మంత్రి సంతోష్ గంగ్వార్,కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్,రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడ,మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి దేబశ్రీ చౌదరి,విద్యాశాఖ సహాయమంత్రి సంజయ్ షామ్ రావ్ ధోత్రీ,జల్ శక్తి శాఖ సహాయ మంత్రి రతన్ లాల్ కతారియా సహా 12మంది తమ పదవులకు రాజీనామా చేశారు.