తాళికట్టు శుభవేళ.. వరుడు చేసిన కొంటె పని వల్ల పెళ్లి రద్దు.. కర్రలతో సమరం

దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఫంక్షన్ హాల్‌ నుంచి ఏడుగురుని అదుపులోకి తీసుకుని వెళ్లారు.

తాళికట్టు శుభవేళ.. వరుడు చేసిన కొంటె పని వల్ల పెళ్లి రద్దు.. కర్రలతో సమరం

Image Credit: pixabay

తాళికట్టు శుభవేళ వరుడు చేసిన ఓ చిన్న పని వల్ల పెళ్లి రద్దు అయింది. అంతేగాక, పెళ్లికూతురు, పెళ్లికొడుకు తరఫువారు పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని హపూర్‌, అశోక్‌ నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

వరుడు, వధువు పెళ్లి దండలు మార్చుకుంటున్న వేళ అమ్మాయికి పెళ్లికొడుకు ముద్దు పెట్టాడు. దీంతో, ముద్దు ఎందుకు పెట్టావని వధువు కుటుంబ సభ్యులు అడిగారు. ఆ తర్వాత పెళ్లికొడుకు, పెళ్లికూతురి కుటుంబాల మధ్య మాటామాటాపెరిగి.. వరుడి కుటుంబంపై వధువు కుటుంబ సభ్యులు దాడికి దిగారు. కర్రలతో కొట్టుకుని పలువురు గాయాలపాలయ్యారు.

వధువు తండ్రికి కూడా గాయాలయ్యాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఫంక్షన్ హాల్‌ నుంచి ఏడుగురుని అదుపులోకి తీసుకుని వెళ్లారు. గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందేలా చేశారు. పెళ్లి కొడుకు అందరి ముందు పెళ్లిపందిరిలోనే బలవంతంగా పెళ్లి కూతురికి ముద్దు పెట్టాడని వధువు తరఫు బంధువులు అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఇప్పటివరకు ఫిర్యాదు అందలేదు.

Hyderabad: మద్యం తరలిస్తున్న లారీ బోల్తా.. సీసాల కోసం ఎగబడ్డ స్థానికులు.. వీడియో