Vaccination Record : ఒక్కరోజే 1.09కోట్ల మందికి కోవిడ్ వ్యాక్సిన్
భారత్ లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. మంగళవారం(ఆగస్టు-31,2021)ఒక్కరోజే కోటికిపైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Vaccination
Vaccination Record భారత్ లో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. మంగళవారం(ఆగస్టు-31,2021)ఒక్కరోజే కోటికిపైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
అయితే ఐదు రోజుల వ్యవధిలో వ్యాక్సిన్ పంపిణీ మార్క్ కోటి దాటడం ఇది రెండోసారి అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం 6గంటల సమయానికళ్లా రికార్డుస్థాయిలో ఒకే రోజు 1,08,84,899 మందికి వ్యాక్సిన్ అందించినట్లు ఆరోగ్యమంత్రి చెప్పారు. ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ కోవిడ్ పై బలమైన పోరాటం చేస్తుందని తెలిపారు.
ఇక, జనవరిలోవ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తంగా 65,03,29,061 టీకా డోసులను పౌరులకు అందించినట్టు కేంద్రఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో 50,12,44,655 మందికి మొదటి డోసులు ఇవ్వగా.. 14,90,84,406 మందికి రెండో డోసు వేసినట్లు చెప్పింది. 60 సంవత్సరాలు పైబడిన 13.34 కోట్ల మందికి టీకాలు వేయగా, 45-60 ఏజ్ గ్రూప్‌లో 19.76 కోట్ల మందికి టీకాలు వేసినట్లు తెలిపింది. 18-44 ఏళ్ల వారిలో ఇప్పటివరకు 31.57 కోట్ల మందికి టీకాలు వేసినట్లు మంత్రిత్వ శాఖ తెలి