INDIA Alliance protest : ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ పేరుతో ఇండియా కూటమి నిరసనలు.. నియంతృత్వ,అప్రజాస్వామిక ప్రభుత్వం అంటూ విమర్శలు

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమి నిసనలు చేపట్టింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సహా పలువురు ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. సేవ్ డెమెక్రసి పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే పలువురు నేతలు వేదిక వద్దకు చేరుకున్నారు.

INDIA Alliance protest : ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ పేరుతో ఇండియా కూటమి నిరసనలు.. నియంతృత్వ,అప్రజాస్వామిక ప్రభుత్వం అంటూ విమర్శలు

INDIA Alliance Leaders protest In Delhi

Updated On : December 22, 2023 / 12:41 PM IST

INDIA Alliance Leaders protest  In Delhi : ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమి నిసనలు చేపట్టింది. ఇండియా కూటమిలోని పలువురు నేతలు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో సహా పలువురు ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. సేవ్ డెమెక్రసి పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే పలువురు నేతలు వేదిక వద్దకు చేరుకున్నారు.

కాగా..పార్లమెంట్ భద్రతా వైఫల్యం గురించి పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లిపోయాయి. దీనిపై కేంద్ర హోమ్ సమాధానం చెప్పాలి అంటూ విపక్షాల ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో ఉభయ సభల నుంచి 146మంది విపక్ష ఎంపీలు సస్పెండ్ కు గురయ్యారు. దీంతో పార్లమెంట్ చరిత్రలోనే ఇంత భారీ సంఖ్యలో ఎంపీలు సస్పెండ్ కావటం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని విమర్శించారు. ఈక్రమంలో దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనే పేరుతో ఇండియా కూటమి నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు..ఇండియా కూటమి శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. తెలంగాణలో కాంగ్రెస్ ఇందిరా పార్క్ వద్ద కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పటికే కేరళతో సహా ఇప్పటికే ఇండియా కూటమి శ్రేణులు నిరసన కార్యక్రమాలు ప్రారంభించారు.

ఇప్పటికే జంతర్ మంతర్ వద్దకు పలువురు కాంగ్రెస్ అగ్రనేతలతో సహా ఇండియా కూటమి నేతలు చేరుకున్నారు. దీంట్లో భాగంగా కాంగ్రెస్ నేత అజరుద్దీన్ కూడా చేరుకున్నారు. ఈ కార్యక్రమాలపై ఆయన మాట్లాడుతు..పార్లమెంట్ లో సభ్యులు నిరసనలు చేయటం సస్పెండ్ చేయటం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. కానీ పార్లమెంట్ చరిత్రలో ఏకంగా 150మంది సభ్యులను సస్పెండ్ చేయటం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని దుయ్యబట్టారు. ఈ విషయం ప్రజలకు తెలియాలన్నారు. ఎంపీలు అందరు బయట ఉంటే పార్లమెంట్ ఎలా పనిచేస్తుంది..? అని ప్రశ్నించారు. ఒక సభ్యుడు తన అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఉందన్నారు. కానీ ఆ హక్కులను కాలరాస్తు ఇలా సస్పెండ్ చేయటం సరికాదన్నారు.

జంతర్ మంతర్ వద్ద భారత పార్టీల నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ సింగ్ మాట్లాడుతూ. ఇంత మంది ఎంపీలను ఎప్పుడైనా సస్పెండ్ చేశారా? అని ప్రశ్నించారు. తాము హోంమంత్రి నుండి ప్రకటన మాత్రమే డిమాండ్ చేసాము..డిమాండ్ చేసినందుకే ఇంతమంది ఎంపీలను సస్పెండ్ చేశారు..” అంటూ మండిపడ్డారు.

అలాగే మరో కాంగ్రెస్ నేత, ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ మాట్లాడుతు..పార్లమెంటే అత్యున్నత నిర్ణయాధికారం గల శక్తి అని..అటువంటి గొప్ప చట్ట సభకు 700 మందికిపైగా సభ్యులు ఎన్నికయ్యారు. కానీ తమ అభిప్రాయాలను చెప్పే ఎంపీలను సస్పెండ్ చేయటం సరికాదన్నారు. భారీ సంఖ్యలో ఎంపీలను సస్పెండ్ చేసి సభను నడిపే హక్కు ప్రభుత్వానికి లేదన్నారు. ఈ ప్రభుత్వం పూర్తిగా నియంతృత్వ..అప్రజాస్వామిక ప్రభుత్వం అని దుయ్యబట్టారు.

ఎంపీల సామూహిక సస్పెన్షన్ కు వ్యతిరేకంగా తాము ఐక్యంగా నిరసనలు తెలియజేస్తున్నామని ఎంపీ మహువా అన్నారు.

దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, అన్ని జాతీయవాద సంస్థలు ఏకతాటిపైకి వచ్చి ఒకే స్వరంలో సందేశం పంపాలి అని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ అన్నారు.


తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, సీనియర్ నేతలు పాల్గొననున్నారు. దేశ వ్యాప్తంగా ఇండియా కూటిమి నిరసనల్లో భాగంగా..దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టింది.