India vs China: బోర్డర్‌లో ఉద్రిక్తత.. భారత్ – చైనా సైనికుల మధ్య ఘర్షణ.. ఇరువర్గాల సైనికులకు గాయాలు
ఇండియా - చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇరు దేశాలకు చెందిన సైనికులకు గాయాలైనట్లు తెలుస్తుంది. ఈ ఘర్షణలో గాయపడిన ఆరుగురు భారతీయ సైనికులను చికిత్స కోసం గౌహతికి తీసుకువచ్చినట్లు సమాచారం.

india vs china
India vs China: ఇండియా – చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇరు దేశాలకు చెందిన సుమారు 30 మందికిపైగా సైనికులకు గాయాలైనట్లు తెలుస్తుంది. అయితే, ఈ ఘటన డిసెంబర్ 9న చోటు చేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఈ ఘర్షణ చోటుచేసుకుంది.
China Spy Ship ‘Yuan Wang 5’ : హిందూ మహాసముద్రంలో చైనా గూఢచార నౌక కలకలం .. భారత్‌పైనే కన్ను
తవాంగ్ సెక్టార్ సమీపంలోని యాంగ్‌స్టె ప్రాంతంలో చైనా సైనికులు, భారత సైనికులతో ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాలకు చెందిన కొంతమంది సైనికులకు స్వల్ప గాయాలయ్యాయి. కొద్దిసేపటికే ఇరువర్గాలు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయాయి. సుమారు వందల మంది చైనా సైనికులు 17వేల అడుగుల శిఖరాన్ని చేరుకోవడానికి ప్రయత్నించారు. దీంతో ఇండియా సైనికులు వారి ప్రయత్నాలను తిప్పికొట్టారు. ఇప్పుడు ఆ ప్రాంతం మంచుతో నిండి ఉంది. గతంలో తూర్పు లడఖ్‌లో జరిగిన ఎదురుకాల్పుల తర్వాత భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరగడం ఇదే తొలిసారి. ఇదిలాఉంటే.. ఘర్షణలో గాయపడిన ఆరుగురు భారతీయ సైనికులను చికిత్స కోసం గౌహతికి తీసుకువచ్చినట్లు సమాచారం.
China Warns US: ఆ విషయంలో తలదూర్చొద్దు.. అమెరికా అధికారులకు చైనా వార్నింగ్..
2020 జూన్‌లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారతీయ సైనికులు మరణించారు. 40మందికిపైగా చైనా సైనికులు మరణించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ సంఘటన పాంగోంగ్ సరస్సు ప్రాంతంలోని సౌత్ బ్యాంక్ లో చోటుచేసుకుంది. రెండు దేశాల మధ్య వరుస ఘర్షణలకు దారితీసింది. అయితే, ఇరు దేశాల సైనిక అధికారుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరగడం ద్వారా ఆ ప్రాంతంలో శాంతియుత వాతావరణం నెలకొంది. లడఖ్‌లోని గోగ్రా -హాట్ స్ప్రింగ్స్‌తో సహా కీలకమైన పాయింట్ల నుంచి ఇరు దేశాల సైనికులు వెనక్కు వెళ్లిపోయారు. తాజాగా ఈ ఘర్షణతో మరోసారి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే, ఈ ఘటన జరిగిన వెంటనే ఇరు దేశాల సైనికులను ఆయా దేశాలు వెనక్కి రప్పించినట్లు తెలుస్తోంది.
The details of the incident are sketchy. What was the cause of the clash? Were shots fired or was it like Galwan? How many soldiers have been injured? What is their condition? Why can’t the Parliament extend their public support to the soldiers to send a strong message to China?
— Asaduddin Owaisi (@asadowaisi) December 12, 2022
ఇదిలాఉంటే.. అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఘర్షణపై ప్రభుత్వం పార్లమెంటుకు ఎందుకు తెలియజేయలేదని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తాజా ఘటనపై స్పందించింది.. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్ – చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం తన మెతక వైఖరిని విడిచి.. చైనాకు గట్టి గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ పేర్కొంది.