India Corona : ఇండియాకు రిలీఫ్.. కరోనా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ

కరోనా విలయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశానికి కాస్త రిలీఫ్ ఇచ్చే వార్త ఇది. దేశంలో కరోనా కొత్త కేసులకంటే రికవరీలే ఎక్కువ. తాజాగా 2.08లక్షల మందికి కరోనా సోకగా.. 4వేలకు పైగా మరణాలు సంభవించాయి. ఈ మేరకు బుధవారం(మే 26,2021) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది. కాగా, మొదటిసారి 22లక్షలకుపైగా నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు.

India Corona : ఇండియాకు రిలీఫ్.. కరోనా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ

India Corona

Updated On : May 26, 2021 / 12:57 PM IST

India Coronavirus Updates : కరోనా విలయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశానికి కాస్త రిలీఫ్ ఇచ్చే వార్త ఇది. దేశంలో కరోనా కొత్త కేసులకంటే రికవరీలే ఎక్కువ. తాజాగా 2.08లక్షల మందికి కరోనా సోకగా.. 4వేలకు పైగా మరణాలు సంభవించాయి. ఈ మేరకు బుధవారం(మే 26,2021) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది. కాగా, మొదటిసారి 22లక్షలకుపైగా నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు.

24 గంటల వ్యవధిలో 22,17,320 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..2,08,921 కొత్త కేసులు వెలుగుచూశాయి. సుమారు 40 రోజుల తర్వాత 2లక్షల దిగువకు చేరిన కేసులు.. తాజాగా మరోసారి ఆ మార్కును దాటాయి. రోజూవారీ మరణాల్లో పెరుగుదల కనిపించింది. 4వేల 157 మంది చనిపోయారు. ఇప్పటివరకు 2,71,57,795 మందికి కరోనా సోకగా..3,11,388 మంది ప్రాణాలు వదిలారు.

కాగా, నిన్న కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ. 2లక్షల 95వేల 955 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. వరసగా 13వ రోజు కొత్త కేసులు కంటే రికవరీలే ఎక్కువగా నమోదయ్యాయి. మొత్తంగా 2.43 కోట్ల మందికిపైగా మహమ్మారి నుంచి బయటపడగా..రికవరీ రేటు 89.26 శాతానికి చేరింది.

కరోనా ఉద్ధృతి కాస్త అదుపులో ఉండటంతో.. యాక్టివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం 24,95,591మంది కొవిడ్‌తో బాధపడుతుండగా..క్రియాశీల రేటు 9.60 శాతానికి చేరింది.