Covid-19 Vaccination: తొలిసారి ఇండియాలో ఒక్కరోజే కోటి వ్యాక్సినేషన్లు

కొవిడ్‌‌పై పోరాడేందుకు చేపట్టిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భారత్‌ అరుదైన ఘనత నమోదు చేసింది. ఒక్కరోజులోనే కోటి డోసులు పంపిణీ చేసి అరుదైన రికార్డు కొట్టేసింది.

Covid-19 Vaccination: తొలిసారి ఇండియాలో ఒక్కరోజే కోటి వ్యాక్సినేషన్లు

Covid Vaccine

Updated On : August 28, 2021 / 9:54 AM IST

Covid-19 Vaccination: కొవిడ్‌‌పై పోరాడేందుకు చేపట్టిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భారత్‌ అరుదైన ఘనత నమోదు చేసింది. ఒక్కరోజులోనే కోటి డోసులు పంపిణీ చేసి అరుదైన రికార్డు కొట్టేసింది. ఒక్కరోజే ఈ స్థాయిలో వ్యాక్సినేషన్ చేపట్టడం భారత్ లో ఇదే తొలిసారి. ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

శుక్రవారం రాత్రి 10గంటల వరకు దేశ వ్యాప్తంగా కోటీ అరవై నాలుగు వేలకు పైగా వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ జరిగింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న వయోజన జనాభాలో సగం మందికి కొవిడ్‌ మొదటి డోసు వ్యాక్సిన్‌ పూర్తయిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. ఈ ఏడాది మొదట్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభం అయింది.

ఇప్పటివరకు 62కోట్ల డోసుల టీకా పంపిణీ పూర్తయిందని రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద 4.05 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నిర్వహించిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో చైనా ముందంజలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో భారత్‌ కొనసాగుతోంది.

డిసెంబరు నాటికి దేశ వ్యాప్తంగా 60 శాతం మందికి టీకా పూర్తి చేయాలని.. 10.9 మిలియన్ల డోసులను పంపిణీ చేయడానికి భారత్‌ లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్న వారు.. రెండో డోస్ వ్యాక్సిన్ వేసుకునేందుకు స్లాట్లు దొరక్క ఇబ్బంది పడుతున్నారు.