Jaahnavi Kandula: జాహ్నవి కందుల మృతిపై అమెరికా పోలీసుల వ్యంగ్యం.. సీరియస్ గా స్పందించిన భారత్

అమెరికాలో చదువుకుంటున్న ఆంధ్ర విద్యార్ధిని జాహ్నవి కందుల జనవరిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై సియాటెల్ పోలీసులు అధికారులు జోక్ చేస్తూ మాట్లాడిన క్లిప్ బయటకు వచ్చింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిందిగా శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ అమెరికాను కోరింది.

Jaahnavi Kandula: జాహ్నవి కందుల మృతిపై అమెరికా పోలీసుల వ్యంగ్యం.. సీరియస్ గా స్పందించిన భారత్

New Delhi

Updated On : September 14, 2023 / 12:50 PM IST

Jaahnavi Kandula – America  : అమెరికా జరిగిన రోడ్డు ప్రమాదంలో తెెలుగు విద్యార్ధిని జాహ్నవి కందుల మరణంపై శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ఆందోళన వ్యక్తం చేసింది. విద్యార్ధిని మరణంపై సీటెల్  పోలీసు అధికారి వ్యంగంగా మాట్లాడిన ఫుటేజ్‌పై సమగ్ర దర్యాప్తు చేయాలని అమెరికాను కోరింది.

California : కుల వివక్ష వ్యతిరేక బిల్లుపై సంతకం చేయవద్దంటూ అమెరికాలో నిరసనలు

జాహ్నవి కందుల (23) జనవరిలో అధికారి కెవిన్ డేవ్ నడుపుతున్న పోలీసు వాహనం ఢీకొని మరణించారు. ఆమె సీటెల్ క్యాంపెస్‌లో మాస్టర్స్ విద్యార్ధిని. సీటెల్ పోలీస్ డిపార్ట్ మెంట్ ఇటీవల విడుదల చేసిన వీడియోలో ప్రమాదం గురించి చర్చిస్తున్నప్పుడు పోలీసు అధికారి వ్యంగంగా నవ్వడం వినిపించింది. క్లిప్ సీటెల్ పోలీస్ ఆఫీసర్ గిల్డ్ ప్రెసిడెంట్‌తో మాట్లాడిన కాల్‌లో ‘మిస్ కందుల ఓ సాధారణమైన వ్యక్తి, ఆమె చనిపోయింది.. ఒక చెక్కు రాయండి.. పదకొండు వేల డాలర్లు’ వ్యంగ్యంగా అన్నాడు. ఈ వీడియోపై జాహ్నవి అంకుల్ స్పందించారు. ఈ ఆఫీసర్లను చూస్తుంటే వీరి కుమార్తెలు, మనవరాళ్లకి కూడా ఇలాగే విలువ కడతారా? అని ప్రశ్నించారు.

Sanatana Dharma Row : అమెరికాలో సెప్టెంబర్ 3న సనాతన ధర్మం రోజుగా ప్రకటన

ఈ క్లిప్ బయటకు వచ్చాక శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసులో ప్రమేయం ఉన్నవారిపై చర్య తీసుకోవాలని అమెరికాను కోరింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాహ్నవి సీటెల్‌లోని ఈశాన్య విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు.