Renaming Places In Arunachal : అరుణాచల్ ప్రాంతాలకు పేర్లపై సమర్థించుకున్న చైనా.. ఖండించిన భారత్

భారత భూభాగంలోని అరుణాచల్ ప్రదేశ్ లో 15 ప్రాంతాలకు పేర్లను మార్చాలని చైనా తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఇరుదేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లోని

Renaming Places In Arunachal : అరుణాచల్ ప్రాంతాలకు పేర్లపై సమర్థించుకున్న చైనా.. ఖండించిన భారత్

India China

Updated On : December 31, 2021 / 7:07 PM IST

Renaming Places In Arunachal : భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తమ భూభాగమని చాలా ఏళ్లుగా వాదిస్తోన్న చైనా..తాజాగా ఆ రాష్ట్రంలోని  15 ప్రాంతాలకు పేర్లను మార్చాలని చైనా తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఇరుదేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని పేర్లను మార్చడం ద్వారా వాటిని తమవిగా చెప్పుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలకు భారత్ ఆదిలోనే చెక్ పెట్టింది.

అరుణాచల్ ప్రదేశ్​ ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టినంత మాత్రాన వాస్తవం మారదని, అది ఎప్పటికీ భారత భూభాగమేనని గురువారం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్పష్టం చేశారు. చైనా ఇలా చేయడం కొత్తేం కాదని, 2017లో కూడా ఇలానే కొన్ని ప్రాంతాలకు పేర్లు పెట్టిందని గుర్తు చేశారు. అరుణాచల్ భారత్​లో అంతర్భాగమని, చైనా ఇలాంటి చర్యలు మానుకోవాలని అరిందమ్ బాగ్చీ తెలిపారు.

అయితే,భారత్ తీవ్ర స్పందన నేపథ్యంలో శుక్రవారం దీనిపై చైనా వివరణ ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్.. దక్షిణ టిబెట్​లో భాగమని, తాము పేర్లు పెట్టడం తప్పేంకాదని డ్రాగన్ పేర్కొంది. అరుణాచల్​ దక్షిణ టిబెట్​లో భాగమని, అక్కడ ఎన్నో సంప్రదాయ తెగలు చాలా ఏళ్లుగా జీవిస్తున్నాయని తెలిపింది. స్వయంప్రతిపత్తి గల ప్రాంతానికి తాము పేర్లు పెట్టడంలో తప్పేముందని మరోమారు మొండి వాదన చేసింది.

కాగా,చైనా అత్యున్నత శాసన మండలి అయిన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ అక్టోబర్ 23న ఆమోదించిన కొత్త సరిహద్దు చట్టాన్ని అమలు చేయడానికి కేవలం రెండు రోజుల ముందు గురువారం… అరుణాచల్ ప్రదేశ్ లోని 15 ప్రాంతాల పేర్లు మార్చింది చైనా. ఈ 15 ప్రాంతాల్లో 8 నివాస ప్రాంతాలు కాగా… 4 పర్వతాలు, రెండు నదులు, ఓ పర్వత మార్గం ఉన్నాయి. ఈ 15 ప్రాంతాలకు చైనీస్​, టిబెటన్, రోమన్ ఆల్పబెట్​లతో అధికారిక పేర్లు పెట్టారు.

8 నివాసిత ప్రాంతాలను… స్నగ్​కెజాంగ్​, దగ్లుంగ్​ జాంగ్​, మనిగాంగ్​, డుడింగ్, న్యింగ్​చి, గోలింగ్​, డంబా, మెజాగ్​గా నామకరణం చేసింది. నాలుగు పర్వతాలకు వామో రి, డు రి, లన్​జుబ్​ రి, కున్​మింగ్​జింగ్​ ఫెంగ్​ అని నామకరణం చేసింది. అలాగే రెండు నదులకు జెన్​యోగ్మో, దులైన్​ అని.. పర్వత మార్గాన్ని ‘సె లా’ అని పేరు పెట్టింది చైనా. కాగా,ఇప్పటికే అరుణాచల్​ ప్రదేశ్​ను చైనా… ‘జన్​గ్నాన్​’ అని చైనీస్​ పేరుతోనే పిలుస్తోన్న విషయం తెలిసిందే.

ALSO READ Telangana Liquor : లిక్కర్ స్కేల్ లో రికార్డు…డిసెంబర్ నెలలో రూ. 3 వేల 350 కోట్ల మద్యం అమ్మకాలు