భారత్ – నేపాల్ పెట్రోలియం పైపులైన్ ప్రారంభం

భారత్ – నేపాల్ దేశాల మధ్య పెట్రోలియం పైపులైన్ ప్రారంభమైంది. సెప్టెంబర్ 10వ తేదీ మంగళవారం భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ రిబ్బన్ కట్ చేశారు. మోతీ హరి – అమ్ లేక్ గంజ్ మధ్య ఈ ప్రారంభోత్సవం జరిగింది. మోదీ, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. మోడీ బటన్ నొక్కి పైపులైన్ ప్రాజెక్టు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ..సౌత్ ఏషియాలో ఫస్ట్ టైమ్ పెట్రోలియం పైప్ లైన్ ప్రారంభం కావడంతో సంతోషంగా ఉందని, రికార్డు సమయంలో ఈ ప్రాజెక్టు పూర్తి చేశామన్నారు. అయితే..పెట్రోలియం పైపులైన ప్రాజెక్టు నిర్మాణ విషయంలో నేపాల్ కు క్రెడిట్ దక్కుతుందని, 2015లో భూకంపం వచ్చిన తర్వాత నేపాల్ కోలుకున్నదన్నారు. ఈ సమయంలో నేపాల్ పునర్ నిర్మాణంలో భారత్ సహకరించిందని చెప్పుకొచ్చారు. రెండు దేశాలు సంయుక్తంగా కృషి చేయడం వల్ల గోర్ఖా, నువాకోట్ జిల్లాలో ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తయిందన్నారు మోడీ.
1973 ఒప్పందం ప్రకారం..పెట్రోలియం ఉత్పత్తులను ట్యాంకర్ల ద్వారా భారతదేశం నుంచి నేపాల్ తీసుకెళుతోంది. మొదటి దశలో 60 కిలోమీటర్ల పొడవున్న పెట్రోలియం పైపులైన్ ను బీహార్ లోని మోతీహరి నగరం నుంచి డీజిల్ సరఫరా చేయడానికి ఉపయోగించనుంది నేపాల్. భద్రత కల్పించడానికి నేపాల్ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేసింది. మోతీ హరి – అమ్లేఖ్ గంజ్ చమురు పైపులైన్ ప్రాజెక్టును 1996లో ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు అమలు చేయడానికి రెండు ప్రభుత్వాలు 2015 ఆగస్టులో ఒప్పందం చేసుకున్నాయి. అదే సంవత్సరంలో నేపాల్ లో సంభవించిన భూకంపం కారణంగా ప్రాజెక్టు కొంత డీలే అయ్యింది.
Read More : ఇస్రో ఉద్యోగులకు షాక్ : శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల జీతాల్లో కోత